Son Of india డైరెక్టర్ తో పవన్ కళ్యాణ్.. బండ్ల గణేష్ మాటపై దర్శకుడి కామెంట్!

మోహన్ బాబు హీరోగా డైరెక్టర్ రత్నబాబు దర్శకత్వం వహించిన సన్ ఆఫ్ ఇండియా సినిమా ఈ ఏడాది ఫిబ్రవరిలో థియేటర్లలో విడుదలైన విషయం తెలిసిందే. అయితే సినిమా విడుదల తర్వాత ఊహించిన విధంగా ఫలితాన్ని అందుకోవడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. ఇక ఈ సినిమా దర్శకుడు డైమండ్ రత్న బాబు మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇక ఆ సినిమాకు సంబంధించిన విశేషాలను చెబుతూ బండ్ల గణేష్ తో పవన్ కళ్యాణ్ సినిమాపై చర్చలు కూడా జరిగినట్లు చెప్పాడు. ఆ వివరాలలోకి వెళితే..

రైటర్ గా వర్క్ చేసి..

రైటర్ గా వర్క్ చేసి..

పలు కామెడీ సినిమాలకు రైటర్ గా వర్క్ చేసిన డైమండ్ రత్నం బాబు మొదట బుర్రకథ అనే సినిమాను డైరెక్టర్ చేశాడు. ఆ సినిమాలో అది సాయికుమార్ హీరోగా నటించాడు. ఇక తర్వాత ఎక్కువగా మంచు హీరోల సినిమాలకు రైటర్ గా వర్క్ చేస్తూ వచ్చాడు. ఇక ఫైనల్ గా అతనికి మోహన్ బాబు దర్శకుడిగా ఒక అవకాశం ఇచ్చాడు.

సన్ ఆఫ్ ఇండియా

సన్ ఆఫ్ ఇండియా

ఇక మంచు విష్ణు నిర్మించిన సన్ ఆఫ్ ఇండియా ఈ ఏడాది ఫిబ్రవరి 18వ తేదీన థియేటర్లలో విడుదలైంది. ఇక ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్ లో కూడా చిత్ర యూనిట్ హడావిడిగా పాల్గొన్నారు. తప్పకుండా సినిమా సరికొత్త ప్రయోగాత్మకంగా సక్సెస్ అందుకుంటుంది అని మోహన్ బాబు కూడా నమ్మకంతో తెలియజేశారు. కానీ సినిమా ఊహించిన విధంగా ఫ్లాప్ అయ్యింది.

 ప్రయోగం చేయాలని..

ప్రయోగం చేయాలని..


ఇక ఇదే విషయం ఇటీవల ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో దర్శకుడు రత్నబాబు వివరణ ఇచ్చే ప్రయత్నం చేశాడు. సన్ ఆఫ్ ఇండియా కథ కంటే ముందు మరొక సినిమా కూడా చేయాలని అనుకున్నాము. ఒక విధంగా ఒకే క్యారెక్టర్ తోనే సినిమాను చేయాలని ట్రై చేసాము.. కానీ అదే వర్కౌట్ కాలేదు. అయినప్పటికీ మోహన్ బాబు ఎంతో సపోర్ట్ గా నిలిచినట్లు చెబుతూ మరో అవకాశం కూడా ఇవ్వడానికి ఆయన రెడీ అయినట్లుగా రత్నబాబు తెలిపారు.

పవన్ తో సినిమా

పవన్ తో సినిమా

అయితే సన్ ఆఫ్ ఇండియా సినిమా షూటింగ్ దశలో ఉన్నప్పుడే నిర్మాత బండ్ల గణేష్ తనతో పవన్ కళ్యాణ్ కు కథ రెడీ చేయమని చెప్పారు. అప్పుడే నేను మెకానిక్ అనే ఒక సోషల్ మెసేజ్ ఉన్న మంచి పాయింట్ కూడా చెప్పాను. తప్పకుండా ఆయన సినిమా చేద్దామని కూడా అన్నారు. కానీ సన్ ఆఫ్ ఇండియా డిజాస్టర్ తర్వాత పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. మళ్ళీ నాకు ఎలాంటి కాల్ కూడా రాలేదు.. అని అన్నాడు.

తరువాత సినిమా..

తరువాత సినిమా..


సన్ ఆఫ్ ఇండియా సక్సెస్ అయ్యి ఉంటే తన పరిస్థితి మరొకలా ఉండేది అని ఆ సినిమా డిజాస్టర్ అయిన తరువాత ఆఖరికి మా ఇంటి వాచ్ మెన్ కూడా తన మాటకు విలువ ఇవ్వలేదు అనే విధంగా రత్నబాబు ఆవేదన వ్యక్తం చేశాడు. ఇక తదుపరి సినిమా అన్ స్టాపబుల్ మాత్రం తప్పకుండా కామెడీ ఎంటర్టైనర్ గా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది అని ఈ సినిమాలో సప్తగిరి బిగ్ బాస్ విన్నర్ సన్నీ హీరోలుగా నటిస్తున్నట్లు రత్నబాబు తెలియజేశాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X