For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  సన్ ఆఫ్ సత్యమూర్తి చిన్నారి ఇప్పుడు ఎలా ఉందో చూశారా.. ట్రెడిషినల్, స్టైలిష్ లుక్స్ వైరల్

  |

  సినిమా ఇండస్ట్రీలో కొంతమంది చైల్డ్ ఆర్టిస్టులను మర్చిపోవడం అంత ఈజీ కాదు పెద్దగా అనుభవం లేకపోయినప్పటికీ కూడా చాలా సన్నివేశాల్లో వారు చూపించే హావభావాలు జనాల్లో అలా పాతుకుపోతూ ఉంటాయి. అప్పట్లో చైల్డ్ ఆర్టిస్టులు వరుసగా సినిమాలతో బిజీగా కనిపించేవారు. కాని ఇటీవల కాలంలో మాత్రం అలా ఎక్కువ మంది పెద్దగా కనిపించడం లేదు. ఒకటి రెండు మూడు సినిమాలతోనే మాయమవుతున్నారు. ఇక సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమాలో నటించిన చిన్నారి గురించి అందరికీ గుర్తుండే ఉంటుంది. ఇక ఆ పాప ప్రస్తుతం ఎలా ఉంది అనే వివరాల్లోకి వెళితే..

  హైలెట్ క్యారెక్టర్

  హైలెట్ క్యారెక్టర్

  త్రివిక్రమ్ అల్లు అర్జున్ కలయికలో వచ్చిన రెండవ సినిమా సన్నాఫ్ సత్యమూర్తి అప్పట్లో బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ సొంతం చేసుకుంది. మాస్ ప్రేక్షకులతో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ ను కూడా ఈ సినిమా ఎంతగానో ఆకట్టుకుంది. ముఖ్యంగా అల్లు అర్జున్ నటించిన విధానం అలాగే ఉపేంద్ర నటన కూడా ఆ సినిమాలో చాలా హైలైట్ గా నిలిచింది. దానికి తోడు అన్న కూతురిగా హీరో అల్లు అర్జున్ పక్కనే కనిపించిన చిన్నారి వర్ణిక కూడా చాలా హైలెట్ అయింది.

  అలా సెలెక్ట్..

  అలా సెలెక్ట్..

  సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలో ఒక చిన్నారి పాప క్యారెక్టర్ కోసం దర్శకుడు త్రివిక్రమ్ చాలామందితో ఆడిషన్స్ నిర్వహించాడు. కొంతమంది పిల్లలను కూడా ఫైనల్ లిస్ట్ కు చేర్చుకున్నారు. ఫైనల్ గా ఒక ఐదు మందిలో ఎవరో ఒకరిని ఫిక్స్ చేసుకోవాలని అనుకోగా ఆ సమయంలో అనుకోకుండా తన అసిస్టెంట్ డైరెక్టర్ ద్వారా త్రివిక్రమ్ ఒక చిన్నారి ఫోటో చూశాడు. ఆ పాప చాలా బాగా క్యూట్గా అనిపించడంతో త్రివిక్రమ్ మరో ఆలోచన లేకుండా ఆమెను తీసుకోవాలని ఫిక్స్ అయ్యాడు.

  మొదట కంగారు పడ్డారట

  మొదట కంగారు పడ్డారట

  అయితే సినిమా షూటింగ్స్ అలవాటు లేదు అని వారి పేరెంట్స్ వర్ణిక పేరెంట్స్ కాస్త కంగారు పడ్డారట. పాప ఎలా నటిస్తుందో అని కూడా వాళ్ళు కొంత ఆందోళన చెందడంతో దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా మాట్లాడి కొన్ని రోజులపాటు చిన్నారి వర్ణికను చిత్ర యూనిట్ సభ్యులతో కొంత టైం స్పెండ్ చేసే విధంగా ఏర్పాట్లు కూడా చేశారట. ముఖ్యంగా అల్లు అర్జున్ కూడా అప్పుడప్పుడు ఆ పాపను కలుస్తూ మంచి స్నేహపూర్వకంగా మార్చేసుకున్నారు. దీంతో షూటింగ్ లో పెద్దగా ఇబ్బంది కలగలేదట.

  రెండు సినిమాలు

  రెండు సినిమాలు


  ఇక ఆ విధంగా సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలో నటించిన వర్ణిక ఆడియెన్స్ కు కూడా చాలా బాగా నచ్చేసింది. ముఖ్యంగా అల్లు అర్జున్ తో పాప సన్నివేశాలు చాలా బాగా వర్క్వుట్ అయ్యాయి. ఇక సన్నాఫ్ సత్యమూర్తి తర్వాత ఎన్టీఆర్ నాన్నకు ప్రేమతో సినిమాలో రకుల్ ప్రీత్ చిన్నప్పటి పాత్రలో నటించింది. మళ్ళీ ఆ తర్వాత వర్ణిక పెద్దగా సినిమాలు చేసింది లేదు.

  లేటెస్ట్ లుక్ వైరల్

  లేటెస్ట్ లుక్ వైరల్

  ఇక రీసెంట్ గా ఆమె ఫోటోలు కొన్ని సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. వర్ణిక ఒక ఫోటోలో చాలా స్టైలిష్ గా కనిపిస్తూ ఉండగా మరొక ఫోటోలు లంగ వోనితో చాలా ట్రెడిషినల్ గా కనిపించింది. ప్రస్తుతం స్కూల్ దశలో ఉన్న చిన్నారి వర్ణిక పూర్తిగా చదువుపైనే ఫోకస్ పెట్టిందట. కొన్ని చిన్న సినిమాల్లో అవకాశాలు వచ్చినప్పటికీ కూడా తల్లిదండ్రులు ఒప్పుకోలేదు అని తెలుస్తోంది.

  English summary
  Son of satyamurthy child artist varnika latest look viral
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X