రాజమౌళి మూవీ రీమేక్: సిక్కు సంఘాల ఆగ్రహం
ముంబై: తెలుగులో రాజమౌళి డైరెక్ట్ చేసిన సినిమా మర్యాద రామన్న హిందీ లో 'సన్ ఆఫ్ సర్దార్' గా రీమేక్ అవుతున్న విషయం అందరికి తెలిసిందే, ఇందులో అజయ్ దేవగన్ మరియు సోనాక్షి సిన్హా నటిస్తున్నారు. ఈ సినిమాని అజయ్ దేవగన్ నిర్మిస్తున్నారు, ఈ సినిమాని దీపావళి సంధర్బంగా నవంబర్ 13 న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానున్నది. ఈ చిత్రానికి అశ్వినీ ధీర్ దర్శకత్వం వహిస్తున్నారు.
తాజాగా ఈ చిత్రం వివాదంలో ఇరుక్కుంది. ఈ చిత్రంలో సిక్కు యువకుడిగా నటిస్తున్న అజయ్ దేవగన్ సిగ్గు తలపాగా ధరించి చాతిపై శివుని టాటూ వేసుకోవడంపై సిక్కు సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అలా కనిపించే సీన్లను తొలగించాలని అజయ్ దేవగన్‌కి నోటీసులు జారీ చేసారు.
అలా చేయని పక్షంలో ఆందోళన చేస్తామని, సినిమాను నడవనీయమని సిక్కు సంఘాలు హెచ్చరించాయి. ఈ నేపథ్యంలో సెన్సార్ బోర్డు కూడా సదరు సీన్లను కత్తించే అవకాశం ఉంది. త్వరలోనే ఈ వివాదం సద్దుమనుగుతుందని 'సన్ ఆఫ్ సర్దార్' దర్శక నిర్మాతలు ఆశాభావం వ్యక్తం చేసారు.


Click it and Unblock the Notifications











