కించపరిచారంటూ హిందీ ‘మర్యాద రామన్న' కి నోటీస్
ముంబై : అజయ్‌దేవగన్, సొనాక్షిసిన్హా, సంజయ్‌దత్, జుహీచావ్లా తదితరుల కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రం 'సన్నాఫ్ సర్దార్'. తెలుగులో సునిల్ హీరోగా రాజమౌళి దర్శకత్వం వహించిన 'మర్యాద రామన్న'కి ఇది రీమేక్. ప్రస్తుతం 'సన్నాఫ్ సర్ధార్' చిక్కుల్లో పడింది. ఇటీవల థియేటర్లలో రిలీజ్ చేసిన ఈ సినిమా ట్రైలర్స్ ముంబెైలో పెద్ద దుమారమే రేపాయి. సిక్కు గెటప్‌లో హీరో అక్షయ్‌కుమార్ చెప్పిన కొన్ని డెైలాగులు ఆ మతస్తుల మనోభావాలను కించపరిచేలా ఉన్నాయని... వాటిని వెంటనే తొలగించాలని ముంబెైలోని సిక్కు మతస్తులు డిమాండ్ చేస్తున్నారు.
తొలిగించలేదంటే సినిమా విడుదల నిలిపేస్తామని బెదిరిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా ట్రైలర్స్ నెట్‌లో హల్‌చల్ చేస్తున్నాయి. త్వరలోనే ఈ సినిమా రిలీజ్‌కు సిద్ధమవు తున్న సందర్భంగా పూర్తినిడివి చిత్రాన్ని ఓసారి తమకు చూపించాలని సిక్కు సాంస్కృతిక బోర్డ్ డిమాండ్ చేస్తోంది. సెన్సార్‌కి వెళ్లేముందే తాము సినిమాని చూసి... అభ్యంతరా లేమైనా ఉంటే చెబుతా మని.. అలా కాని పక్షంలో సినిమాని అడ్డుకుం టామని అంటున్నారు.
ఇక 'సన్నాఫ్ సర్ధార్' అజయ్‌దేవగన్ మాస్ హీరో కాబట్టి ఆయనకు తగ్గట్టుగా, హిందీ నేటివిటీకి అనుగుణంగా కథలో కొంత మసాలా జోడించి తెరకెక్కించారు దర్శకుడు అశ్విన్ ధీర్. నవంబర్ 13న ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు. ఈ చిత్రంలో జూహీ ఛావ్లా,సోనాక్షి సిన్హా నటిస్తున్నారు. మొదట ఈ టైటిల్ ని అక్షయ్ నమోదు చేసుకున్నారు కానీ అజయ్ రిక్వెస్ట్ పై ఇచ్చేసారు. అలాగే ఈ చిత్రం పంజాబ్ పాటియాలా నేపద్యంలో జరుగుతుంది. ప్రత్యేకమైన ఇంటిసెట్ వేసి భారీగా ఈ చిత్రాన్ని షూట్ చేసారు.
అజయ్ దేవగన్ మరో ఇద్దరు నిర్మాతలతో కలిసి ఈ చిత్రం రీమేక్ రైట్స్ తీసుకుని రీమేక్ చేసారు. ఈ కామిడీ చిత్రం చూడగానే అజయ్ దేవగన్ నచ్చి ఈ ప్రపోజల్ కి వచ్చారు. అజయ్ దేవగన్ తో అతిధి తుమ్ కబ్ జావోగి అనే కామిడీ చిత్రం రూపొందించిన అశ్విని ధిర్ ఈ చిత్రాన్ని డైరక్ట్ చేసారు. ఇక ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్స్ ని విడుదల చేసారు. అవి మంచి క్రేజ్ ని తెచ్చుకున్నాయి. పూర్తి ఫన్ ని ప్రతిబింబించేలా ఆ పోస్టర్స్ రూపొందించారు. ఇక ఈ చిత్రం కథ విషయానకి వస్తే.. హిందికి తగినట్లు కొన్ని మార్పులు చేస్తున్నట్లు చెప్తున్నారు.
ఇప్పటికే రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన విక్రమార్కుడు రీమేక్ హిందీలో విడుదల అయ్యి ఘన విజయం సాధించింది. ప్రభుదేవా దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో అక్షయ్ కుమార్ హీరోగా చేసారు. సోనాక్షి సిన్హా హీరోయిన్ గా చేసిన ఈ చిత్రం ట్రేడ్ లో మంచి క్రేజ్ తెచ్చుకుంది. రౌడీ రాధోర్ టైటిల్ తో విడుదల అయిన ఈ చిత్రం సూపర్ హిట్ కావటంతో ఈ మర్యాద రామన్న రీమేక్ పైనా ట్రైడ్ లో బాగా నమ్మకాలు వచ్చాయి.


Click it and Unblock the Notifications











