twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'S/O సత్యమూర్తి’పై ఎన్ కౌంటర్ ఎఫెక్ట్, దాడి....

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌‍లోని శేషాచలం అడవుల్లో 20 మంది ఎర్రచందనం స్మగ్లర్లను పోలీసులు ఎన్ కౌంటర్ చేసి మట్టుబెట్టిన సంగతి తెలిసిందే. ఈ ఎఫెక్టు ఇపుడు 'S/O సత్యమూర్తి' సినిమాపై పడింది. ఈ సినిమాకు, ఆ ఎన్ కౌంటర్ కు సంబంధం లేక పోయినా కొన్ని తమిళ సంఘాలు...తెలుగు సినిమాలపై తమ ప్రతాపం చూపిస్తున్నాయి.

    ఈ ఎన్ కౌంటర్ కి నిరసనగా తెలుగు హీరో సినిమాను తమిళనాడులో ప్రదర్శించనివ్వమని తమిళగ వళియురుమై కచ్చి, నామ్ తమిళర్ కచ్చి నిరసన కార్యక్రమాలు చేపట్టారు. కాంచీపురంలో ఈ చిత్రం స్ర్కీనింగ్ అవుతున్న థియేటర్ పై దాడి చేయడం అందరినీ షాక్ కి గురి చేస్తోంది. దాంతో 'సన్నాఫ్ సత్యమూర్తి' స్ర్కీనింగ్ ఆగింది.

    Son of satyamurthy movie theaters attacked in Tamilnadu

    తమిళ సంఘాలు చేస్తున్న ఓవరాక్షన్ పై తెలుగు రాష్ట్రాల్లో ఆగ్రహం వ్యక్తం అవుతోంది. రెండు రాష్ట్రాల సినీ ఇండస్ట్రీ పెద్దలు కలుగజేసుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకురాక పోతే....భవిష్యత్తులో తమిళ సినిమాలు కూడా తెలుగు రాష్ట్రాల్లో అడ్డుకునే పరిస్థితి రావచ్చని విశ్లేషకులు అంటున్నారు.

    'S/O సత్యమూర్తి' చిత్రంలో అల్లు అర్జున్, సమంత, నిత్యామీనన్, అదాశర్మ, ఉపేంద్ర, రాజేంద్రప్రసాద్,స్నేహ, సింధు తులాని, వెన్నెల కిషోర్, బ్రహ్మానందం, రావ్ రమేష్,ఎం.ఎస్.నారాయణ తదితరులు నటించారు. సాంకేతిక వర్గం పి.ఆర్‌.వో- ఎస్‌.కె.ఎన్‌, ఏలూరుశ్రీను, ఆర్ట్ - రవీందర్, కెమెరా - ప్రసాద్ మూరెళ్ల, మ్యూజిక్ - దేవిశ్రీ ప్రసాద్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ - పి.డి.ప్రసాద్, నిర్మాత - రాధాకృష్ణ, స్టోరీ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం - త్రివిక్రమ్.

    English summary
    Katchi and Naam Tamilar Katchi disrupted the screening of Allu Arjun's starrer 'S/O Satyamurthy' in Kanchipuram protesting the encounter.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X