600మంది డాన్సర్స్.. 6 కోట్ల ఖర్చు తో ఐటం సాంగ్
'పార్టీ ఆల్ నైట్' పాటలో సోనాక్షి యో యో హనీ సింగ్, ప్రభుదేవాలతో స్టెప్పులేయనుంది. నేపథ్య నృత్యకారులుగా 600 మంది విదేశీ డాన్సర్స్ ని చూపించనున్నారు. ఈ పాటని బ్యాంకాక్‌లోని ఓ పబ్‌లో చిత్రీకరిస్తారు. పాట కోసం సోనాక్షి ఎంతో బరువు తగ్గించుకున్నారు. ఎక్కువగా చీరల్లోనే కనిపించే ఈమె ఈ ఐటం సాంగ్‌లో కురచ దుస్తుల్లో కనిపించనున్నారు. మళయాళం బ్లాక్ బస్టర్ పొక్కిరి రాజానే హిందీలో బాస్ పేరుతో తీస్తున్నారు. అక్టోబరులో సినిమా విడుదల కానుంది.
పొక్కిరి రాజా లో కథ...పూర్తి మాస్ మసాలా గా సాగుతుంది. చిన్నప్పుడే ఇంట్లోంచి పారిపోయిన కుర్రాడు... సిటీలో డాన్ గా ఎదిగి...తన తమ్ముడుని సేవ్ చేయటానికి తన ఐడింటీటీ బయిట పెట్టకుండా తన ఊరు వస్తాడు. అక్కడ నుంచి జరిగే యాక్షన్ కామెడీ నే సినిమా కథ. ఈ చిత్రంలో శ్రియ హీరోయిన్ గా చేసింది. ముమ్మట్టి లోకల్ డాన్ గా ఫన్ చేస్తూంటాడు. అతని వచ్చి రానీ ఇంగ్లీష్ లో మాట్లాడే మాటలు సినిమాకు హైలెట్ గా నిలిచాయి.


Click it and Unblock the Notifications












