మహేష్ చిత్రంలో సోనాక్షి క్యారెక్టర్ పేరు ఏమిటంటే..
హైదరాబాద్: మహేష్ బాబు సరసన బాలీవుడ్ భామ సోనాక్షి సిన్హా నటించనున్న సంగతి తెలిసిందే. క్రిష్ దర్శకత్వంలో రూపొందనున్న ఈ చిత్రం టైటిల్ 'శివం'. ఇందులో సోనాక్షి పేరు మీనాక్షి అని దర్శకుడు రివిల్ చేసారు. సోనాక్షిని ఈ పాత్రకు ఎంపిక చేయగానే అన్ని చోట్ల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చిందని చెప్పారు. అలాగే ఈ ఎంపికలో ప్రభుదేవా బాగా హెల్ప్ చేసారని అన్నారు. తను రూపొందించే ఈ పాత్రకు ఆమె మాత్రమే న్యాయం చేయగలదని అన్నారు. ఈ కథ మూవీ లవర్స్ కు ఓ డిఫెరెంట్ ఫీల్ ఇస్తుందని అన్నారు.
సోనాక్షి ట్విట్టర్ లో... ''అవును. నేను మహేష్‌తో నటిస్తున్నా. దర్శకుడు చెప్పిన కథ చాలా బాగుంది. అందులో నా పాత్ర ఇంకా బాగా నచ్చింది. తొలిసారి తెలుగులో, అందులోనూ మహేష్ బాబు లాంటి హీరోతో నటించడం ఆనందంగా ఉంది''అని రాసుకొంది సోనాక్షి. ఇక ఈ చిత్రానికి సి.అశ్వనీదత్ నిర్మాత.
ఇప్పటికే స్క్రిప్టు వర్క్ కంప్లీట్ చేసినట్లు స్పష్టం చేసిన క్రిస్... ఈ ఏడాది సమ్మర్లో షూటింగ్ ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నాడు. ఈ చిత్రం పూర్తి కమర్షియల్ నేపథ్యంలో రూపొందించేందుకు దర్శకడు ప్లాన్ చేసుకుంటున్నాడు. ప్రస్తుతం ఈచిత్రానికి 'శివం' అనే టైటిల్ పరిశీలిస్తున్నారు. అశ్వినీదత్ వైజయంతీ మూవీస్ బేనర్ పై ఈచిత్రం రూపొందనుంది.
గతంలో ఓసారి బాలీవుడ్ హీరోయిన్ సోనాక్షి సిన్హా హైదరాబాద్ వచ్చినప్పుడు మీడియా అడిగిన ప్రశ్నకు తనకు ఇష్టమైన హీరో మహేష్ బాబు, అతనితో నటించే అవకాశం వస్తే తెలుగులో సినిమా చేయడానికి రెడీ అంటూ బదులిచ్చిన సంగతి తెలిసిందే. . ఇక పోతే క్రిష్ దర్శకత్వం వహించిన 'కృష్ణం వందే జగద్గురుమ్' చిత్రం బాక్సాఫీసు వద్ద సరైన ఫలితాలను ఇవ్వలేదు.


Click it and Unblock the Notifications











