ఐటమ్ సాంగ్ కి రూ.75 అక్షలు డిమాండ్ చేస్తున్న స్టార్ హీరోయిన్...!?
హిందీ సినిమాలలో ఈవేళ ఐటెం సాంగ్ లేకుండా సినిమానే వుండడం లేదు. మాంచి మసాలా దట్టించిన పాటతో, ద్యాన్సులతో ఐటెం సాంగ్ ఉండాలనేది నేటి సినిమా వ్యాపార సూత్రాలలో ఒకటైపోయింది. అందుకే, నిర్మాతలు ఐటెం సాంగ్ కి ఎంత ఖర్చయినా వెనుకాడడం లేదు. ఈ తరహా పాటలు చేయడంలో మల్లికా షెరావత్ ఆరితేరిపోయింది. తన అందాలన్నిటినీఒలకబోసి, ఓ ఐటెం సాంగ్ చేసేందుకు ఈ సెక్సీమణి అక్షరాలా కోటిన్నర తీసుకుంటోంది.
అలాగే, ఈమధ్య వచ్చిన 'దం మారో దం' సినిమాలో ఐటెం సాంగ్ చేసిన దీపికా పదుకునే కూడా కోటిన్నర చార్జ్ చేసింది. ఇప్పుడు 'దబాంగ్' ఫేం సోనాక్షి సిన్హా కూడా ఈ తరహా పాటలకు సై అంటోంది. తమిళ హిట్ సినిమా 'సింగం' హిందీ రీమేక్ లో ఓ ఐటెం సాంగ్ చేయడానికి 75 లక్షలు చార్జ్ చేస్తోందట. పైగా, ఎక్కువగా ఎక్స్ పోజ్ కూడా చేయదట. ఆ కండిషన్ మీద ఆ రేటుకి యాక్సప్ట్ చేసింది. ఇంకా ప్రముఖ కథానాయికలు కూడా ఇలా ఐటెం సాంగ్స్ చేయడానికి రెడీగా వున్నారు.


Click it and Unblock the Notifications











