ఐటం సాంగ్‌తో సోనాక్షి సిన్హా అందాల ఆరబోత
దబాంగ్ సినిమాతో హీరోయిన్ గా లైమ్‌లైట్‌లోకి వచ్చిన సోనాక్షి సిన్హా....త్వరలో ఐటం సాంగుతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేయడానికి సిద్ధం అవుతోంది. బాలీవుడ్ దర్శకుడు శిరీష్ కుందర్ తీయబోతున్న 'జోకర్" సినిమాలో తన అందాలతో థియేటర్లను షేక్ చేయడాని ఈ ముద్దగుమ్మ ఒప్పుకుంది. ఈ సినిమాలో అక్షయ్ కుమార్ హీరోగా నటిస్తున్నాడు. మంచి శరీర సౌష్టవం, ఆకట్టుకునే రూపం, నిండైన అందాలతో మిసమిసలాడుతున్న సోనాక్షి....ఒంపు సొంపులు సినిమాకు ప్లస్సవుతాయని దర్శక నిర్మాతలు భావిస్తున్నారు.
హీరోయిన్‌గా ఇప్పుడిప్పుడే నిలదొక్కుకుంటున్న సోనాక్షి ఐటం సాంగు చేయడం ఏమిటి? అని కొందరు విమర్శిస్తున్నా...ప్రస్తుతం బాలీవుడ్ లో ట్రెండు మారింది. ఒకప్పడు ఐటం సాంగులకోసం ప్రత్యేకంగా కొందరు భామలు ఉండే వారు. కానీ ఇప్పడు కత్రినా లాంటి స్టార్ హీరోయిన్లు సైతం ఐటం సాగులు చేస్తూ అదరగొడుతున్నారు. ఈ తరుణంలో బాలీవుడ్ పోటీలో దూసుకెళ్లాలంటే ప్రేక్షకులను ఆకట్టుకోవడమే లక్ష్యంగా దూసుకెళ్లడం ఒక్కటే మార్గం. అందుకే ఐటంగా మారడానికి సైతం వెనకాడటం లేదు సోనాక్షి. మరి ప్రేక్షకుల నుంచి స్పందన ఎలా ఉంటుందో చూడాలి.


Click it and Unblock the Notifications











