కమల్ ‘విశ్వరూపం’ నుండి బయటపడ్డ దబాంగ్ హీరోయిన్..!
కమల్ హాసన్ కి టైం బాగున్నట్టు లేదిప్పుడు. అన్నీ బాగానే వున్నాయనుకునేసరికి ఏదో ఒక అవాంతరం వచ్చిపడుతోంది. దాంతో కథ మళ్లీ మొదటికొస్తోంది. ఇదంతా కమల్ తీయాలనుకుంటున్న 'విశ్వరూపం' సినిమా కథ! ఈ ప్రాజక్ట్ కి గత ఐదారు నెలల నుంచీ ఒక దాని తర్వాత ఒకటిగా సమస్య ఎదురవుతోంది. మొదట్లో అమెరికా వీసా ప్రాబ్లం, ఆ తర్వాత దర్శకుడు సెల్వరాఘవన్ అవుట్... తాజాగా ఇప్పుడు కథానాయిక సోనాక్షి సిన్హా అవుట్!
ఈ చిత్రంలో హీరోయిన్ గా సోనాక్షి ఎంపిక అయ్యిందని అందరికి తెలిసిందే. ఈ సినిమా షూటింగు ఎంతకీ స్టార్ట్ అవ్వకపోవడంతో తన డేట్స్ అన్నీ వృథా అయిపోయాయనీ, దాంతో ఆమె అప్ సెట్ అయిందనీ అంటున్నారు. అందుకే, ఈ ప్రాజక్టు నుంచి బయటకు వచ్చేయాలని డిసైడ్ అయి, అడ్వాన్స్ వెనక్కు పంపేసిందట. ఈ పరిణామానికి కమల్ కూడా అప్ సెట్ అయ్యాడట. ఇప్పుడు మరో బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకునేని పట్టుకునే ప్రయత్నాలలో కమల్ ఉన్నాడని సమాచారం. దీపికా అయినా కుదురుగా ఉంటే శంకర, లాయ్ సంగీత సారథ్యంలో తెరకెక్కనున్న ఈ చిత్రం త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది...


Click it and Unblock the Notifications











