తండ్రిని హౌస్ అరెస్టు చేసిన సోనాక్షి
ముంబై: బాలీవుడ్ హీరోయిన్ సోనాక్షి సిన్హా తన తండ్రి, ప్రముఖ నటుడు శతృజ్ఞ సిన్హాను హౌస్ అరెస్టు చేసింది. ఆయన గెస్టులను, స్నేహితులను కలవడానికి బయటకు వెళ్లాలన్నా, ముంబైలో తనకు నచ్చిన చోట్లలో షికార్లు కొడదామన్నా, కనీసం చివరకు తన మొబైల్ ఫోన్ వాడటానికి కూడా అనుమతి ఇవ్వడం లేదట కూతురు సోనాక్షి. అయితే మార్నింగ్ వాక్ మాత్రం వెల్లడానికి ఓకే చెప్పేసింది.
ఇదంతా తన తండ్రి ఆరోగ్యం గురించే అంటోంది ఈ సెక్సీ బ్యూటీ. బయటకు వెళితే శతృజ్ఞ సిన్హా సరైన డైట్ మెయింటేన్ చేయడం లేదని, అందుకే హౌస్ అరెస్టు చేశానని, ఆయన ఆరోగ్యం బాగుండటమే మాకు కావాల్సింది అని చెబుతోంది. కూతురు ఇలా చేయడంపై కాస్త కోపం వస్తున్నా...తన ఆరోగ్యం కోసమే కాబట్టి ఏమీ మాట్లాడలేక పోతున్నాడు.
సోనాక్షి పర్సనల్ విషయాలకొస్తే...'నటిగా ఎవరి పరిధులు వారికుంటాయి. నేను సంప్రదాయాలకు గౌరవమిచ్చే కుటుంబంలో పుట్టి పెరిగాను. ఎట్టి పరిస్థితుల్లో బికినీ ధరించి నటించను' అని చెబుతోంది సోనాక్షి సిన్హా. సినిమాల్లో అవకాశాలు రాకపోయిన ఫర్వాలేదు కానీ బికినీ, లిప్‌లాక్ సన్నివేశాలకు తాను చాలా దూరంగా వుంటానని అంటోంది.
సోనాక్షి అక్షయ్‌తో రౌడీరాథోడ్ నటించగా అది భారీ విజయం సాధించింది. మరో వైపు ఆమె జోకర్ చిత్రంలో నటిస్తోంది. తాజాగా మందానికి పాత్రలో అక్షయ్‌కుమార్ కలిసి మూడో సారి నటించబోతోంది సోనాక్షి. ఈ చిత్రాలు హిట్టయితే బాలీవుడ్ స్టార్ హీరోయిన్ల సరసన చేరవచ్చని బోలెడు ఆశలు పెట్టుకుంది సోనాక్షి.


Click it and Unblock the Notifications











