శృంగార రసం లేదని తేల్చిన దర్శకుడు
'వన్స్ అపాన్ ఎ టైమ్ ఇన్ ముంబై' చిత్రానికి సీక్వెల్ గా రూందిస్తున్న చిత్రంలో సోనాక్షి సిన్హా హీరోయిన్ గా ఎంపికైంది. బాలాజీ మోషన్ పిక్చర్స్ పతాకంపై ఏక్తాకపూర్, శోభాకపూర్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. అక్షయ్‌కుమార్ ప్రధాన పాత్ర పోషించనున్న ఈ చిత్రంలో తొలుత మందాకినిగా కరీనాకపూర్‌ని ఎంపిక చేశారు.
అయితే మందాకిని పాత్ర ఈ చిత్రంలో చాలా బోల్డ్‌గా వుండటంతో ఈ ప్రాజెక్ట్ నుంచి కరీనా తప్పుకుంది. ఇప్పుడు ఆ స్థానంలో సొనాక్షీ సిన్హా అవకాశం దక్కించుకుంది. దర్శకుడు మిలన్ లూథ్రియా మాట్లాడుతూ 'ఇందులో సొనాక్షి సినీ తార యాష్మిన్‌గా నటించనుంది. అమాయకురాలైన ఓ యవతి ఎలా హీరోయిన్ స్థాయికి ఎదిగింది. ఆ తర్వాత ఆమె జీవితం ఎలాంటి మలుపులు తిరిగింది. గ్యాంగ్‌స్టర్‌తో ఎలా ప్రేమాయణాన్ని సాగించింది అన్నదే ఈ చిత్రకథ' అని తెలిపారు.
ఇందులో ఇమ్రాన్‌ఖాన్, కంగనా రనౌత్ నటిస్తారు. ఇందులో సొనాక్షిపై ఎలాంటి శృంగార సన్నివేశాలు వుండవు. ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ఆగస్టులో ప్రారంభమవుతుందని దర్శకుడు తేల్చి చెప్పాడు. పాత్ర బొల్డ్‌గా ఉండటం వల్లనే కరీనా తప్పుకుందని వాస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదన్నారు.
ప్రస్తుతం సోనాక్షి అక్షయ్‌తో రౌడీరాథోడ్, జోకర్ చిత్రాల్లో నటిస్తోంది. తాజాగా మందానికి పాత్రలో అక్షయ్‌కుమార్ కలిసి మూడో సారి నటించబోతోంది సోనాక్షి. ఈ చిత్రాలు హిట్టయితే బాలీవుడ్ స్టార్ హీరోయిన్ల సరసన చేరవచ్చని బోలెడు ఆశలు పెట్టుకుంది సోనాక్షి.


Click it and Unblock the Notifications











