మేనేజర్‌తో ఎఫైరెట్టేసుకున్న హీరోయిన్!
తాజాగా బాలీవుడ్ హీరోయిన్ సోనాక్షి సిన్హా వ్యవహారం ఇప్పుడు బాలీవుడ్లో చర్చనీయాంశం అయింది. ఆమె తన మేనేజర్ తో ఎఫైర్ కొనసాగిస్తుందట. ఇప్పటికే పెళ్లయి విడాకులు తీసుకుని....ఇద్దరు ముగ్గురు హీరోయిన్లతో లవ్వాయణం నడిపించి సదరు వ్యక్తి పేరు బంటీ సచ్‌దేవా.
సాధారణంగా సోనాక్షి తన పర్సనల్ విషయాలను రహస్యంగానే ఉంచుతుంది. అయితే ఎంత దాచినా బంటీతో వ్యవహారం మాత్రం అస్సలు దాగడం లేదు. పైగా బంటీ సచ్ దేవా సోనాక్షికి బావ వరుస అవుతాడు. సోనాక్షికి సంబంధించిన ఎండార్స్‌మెంట్ వ్యవహారాలు కూడా ఇప్పుడు అతనే చూసుకుంటున్నాడు.
ఇటీవల సోనాక్షి ఫాదర్ శత్రుజ్ఞ సిన్హా హాసుపత్రిలో జాయిన్ అయినప్పుడు అందరికంటే ముందు ఆసుపత్రికి వచ్చింది ఇతగాడే. ఆమె తండ్రికి ఇటీవల ఉన్నట్టుండి శ్వాస సమస్య ఏర్పడగానే ఏం చేయాలో తోచని సోనాక్షి వెంటనే తన లవ్వర్ బంటీకి ఫోన్ చేసి పిలిచిందని బాలీవుడ్లో చర్చించుకుంటున్నారు.


Click it and Unblock the Notifications












