ఆమెను....లేడీ రజనీ ఆఫ్ ముంబై అంటూ పొగిడేసాడు
ముంబై: దక్షిణాదిన తనదైన గుర్తింపు తెచ్చుకున్న తమిళ దర్శకుడు మురుగదాస్ కు ఉత్తరాదిన సైతం మంచి క్రేజ్ ఉంది... 'గజిని' తో సౌత్ లో సంచలనం సృష్టించిన మురుగదాస్ నార్త్ లోనూ అదే చిత్రంతో తన తడాఖా చూపించాడు. ప్రస్తుతం మురుగదాస్ హిందీలో మరో చిత్రాన్ని రూపొందించనున్నాడు. సోనాక్షి సిన్హా నాయికగా నటించనున్న ఈ చిత్రానికి 'అకిరా' అనే టైటిల్ ను నిర్ణయించారు.

తమిళంలో సూపర్ హిట్టయిన ‘మౌన గురు' చిత్రాన్ని హిందీలో ‘అకీరా' పేరుతో రీమేక్ చేసారు. అకిరా అనగానే విఖ్యాత జపాన్ దర్శకుడు అకిరా కురోసావానే అందరికీ గుర్తుకు వస్తాడు. అకిరా కురోసావా అంటే దేశవిదేశాల్లో ఎందరికో అభిమానం. జపాన్ భాషలో 'అకిరా' అంటే మేధావి అనే అర్థం ఉంది. అందుకు తగ్గట్టుగానే 'అకిరా'లో సోనాక్షి సిన్హా పాత్రను తీర్చిదిద్దాడట మురుగదాస్.
థ్రిల్లర్ మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో తండ్రీ కూతుళ్లయిన శతృఘ్న సిన్హా, సోనాక్షి కలిసి తొలిసారి నటిస్తుండటం విశేషం. అకీరా సినిమాలో సోనాక్షి నటనకు అభిమానిగా మారిన మురుగదాస్...ఆమెను ‘లేడీ రజనీ ఆఫ్ ముంబై' అంటూ ప్రశంసలు గుప్పించారు.


Click it and Unblock the Notifications











