బాలకృష్ణ- బోయపాటి కాంబో.. క్లారిటీ ఇచ్చిన బాలీవుడ్ హీరోయిన్
నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో కొత్త సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. బాలయ్య కెరీర్‌లో 106వ సినిమాగా ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవలే ఈ సినిమా పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. బాలకృష్ణ లేటేస్ట్ మూవీ 'రూలర్' విడుదల కాగానే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది.
అయితే బాలకృష్ణ- బోయపాటి కాంబోలో రాబోతున్న సినిమా కోసం హీరోయిన్స్ వేటలో చిత్రయూనిట్ పడిందని, ఈ మేరకు పలువురు బాలీవుడ్ తారలను సంప్రదిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. చివరగా బాలీవుడ్ భామ సోనాక్షి సిన్హాను ఫైనల్ చేశారని, ఆమెనే బాలయ్యతో రొమాన్స్ చేయనుందని ఫిలింనగర్ సర్కిల్స్‌లో టాక్ నడుస్తోంది. ఇక ఈ చిత్రంలో బాలయ్య రెమ్మ్యూనరేషన్ 10 కోట్లు అని తెలుస్తోంది.

ఈ నేపథ్యంలో తాజాగా ఈ ఇష్యూపై స్వయంగా సోనాక్షి సిన్హా స్పందించింది. బాలకృష్ణ, బోయపాటి శ్రీను సినిమాలో నటించే విషయమై ట్విట్టర్ వేదికగా క్లారిటీ ఇచ్చింది. గత కొన్నిరోజులుగా బాలకృష్ణ, బోయపాటి శ్రీను సినిమాలో తాను నటిస్తున్నట్లు వార్తలు వింటున్నానని, అందులో నిజం లేదని చెప్పింది సోనాక్షి. తాను చేయబోయే తర్వాతి సినిమాను త్వరలోనే అఫీషియల్‌గా అనౌన్స్ చేస్తా అని ఈ సందర్బంగా ఆమె తెలిపింది. ఇక ఈమె సల్మాన్ ఖాన్‌తో నటించిన 'దబంగ్ 3' సినిమాతో డిసెంబర్ 20న ప్రేక్షకుల ముందుకు రానుంది.


Click it and Unblock the Notifications











