ఆ స్టార్ హీరోయిన్ బలహీనతకు హీరోలు బలి
ఒకే ఒక సినిమాతో స్టార్ హీరోయిన్ స్దాయికి ఎదిగిన అందం సోనాక్షిసిన్హా. లాస్ట్ ఇయర్ సల్మాన్ ఖాన్ 'దబాంగ్' చిత్రంతో ఆమె ఇప్పుడు అందరి పెద్ద హీరోల సినిమాల్లో బుక్ అవుతోంది. అయితే ఆమెకు ఓ బలహీనత ఉంది. అది...కంటిన్యూగా ఎదటువారి ఏమనుకుంటారు అన్న ఆలోచన లేకుండా మాట్లాడటం. దాంతో హీరోల పరిస్ధితి మింగలేక కక్కలేక అన్నట్లు తయారైంది.ఈ విషయాన్ని ఆమె కూడా ఒప్పుకుంటోంది. ఆమె మాట్లాడుతూ...'ఏదీ దాచుకోను, అబద్దాలు చెప్పలేను. నా చిన్నతనంలో జరిగిన విషయాలన్నీ పొల్లుపోకుండా చెబుతుంటా. అందులో ఆసక్తికరమైన విషయాలు చాలా ఉంటాయి. ఒక్కోసారి స్పీచ్‌లు తట్టుకోలేక స్నేహితులు గోలపెడుతుంటారు. అవన్నీ ఎందుకు చెబుతుంటావని తిడుతారు కూడా. ఏదైనా విషయాన్ని నా కడుపులో దాచుకోవటం వల్లకాదు. నలుగురితో పంచుకొని, హాయిగా భారాన్ని దించుకుంటా. అది నా బలహీనత' అంటోంది. ఏ బలహీనత అయినా భరిచవచ్చు కానీ ఈ నాన్ స్టాప్ బాదుడు అంటే కష్టమేగా అని ఆమె గురించి తెలిసున్న వారు అంటున్నారు.


Click it and Unblock the Notifications











