మహేష్-క్రిష్ సినిమాలో దబాంగ్ హీరోయిన్!
హైదరాబాద్: గతంలో ఓసారి బాలీవుడ్ హీరోయిన్ సోనాక్షి సిన్హా హైదరాబాద్ వచ్చినప్పుడు మీడియా అడిగిన ప్రశ్నకు తనకు ఇష్టమైన హీరో మహేష్ బాబు, అతనితో నటించే అవకాశం వస్తే తెలుగులో సినిమా చేయడానికి రెడీ అంటూ బదులిచ్చిన సంగతి తెలిసిదే. ఆమె కోరిక నిజమయ్యే రోజు దగ్గర్లోనే ఉంది.
మహేష్ బాబు-క్రిష్ కాంబినేషన్లో రూపొందబోయే చిత్రంలో సోనాక్షి సిన్హాను హీరోయిన్ గా తీసుకోవాలని దర్శకుడు నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఆమె ఈ చిత్రానికి సైన్ చేసాక అధికారిక ప్రకటన వెలువడనుంది. అశ్వినీదత్ వైజయంతీ మూవీస్ బేనర్ పై ఈచిత్రం రూపొందనుంది.
ఇప్పటికే స్క్రిప్టు వర్క్ కంప్లీట్ చేసినట్లు స్పష్టం చేసిన క్రిస్... వచ్చే ఏడాది సమ్మర్లో షూటింగ్ ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నాడు. ఈ చిత్రం పూర్తి కమర్షియల్ నేపథ్యంలో రూపొందించేందుకు దర్శకడు ప్లాన్ చేసుకుంటున్నాడు. ప్రస్తుతం ఈచిత్రానికి 'శివం' అనే టైటల్ పరిశీలిస్తున్నారు.
ప్రస్తుతం మహేష్ బాబు సుకుమార్ దర్శకత్వంలో ఓ సిసినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈచిత్రం పూర్తయిన తర్వాత మహేష్-క్రిష్ కాంబినేషన్ మొదలు కానుంది. ఇక పోతే క్రిష్ దర్శకత్వం వహించిన 'కృష్ణం వందే జగద్గురుమ్' చిత్రం ఇటీవలే విడుదలై మంచి కలెక్షన్లు సాధిస్తోంది.


Click it and Unblock the Notifications











