టాటూ అక్కడ వేయించుకుంది (ఫొటో)
ముంబై: టటూ వేయించుకోవటం అనేది సినీ స్టార్స్ కి కొత్తేమి కాదు. అయితే వాటిని తన అభిమానులు చూడాలని మరీ ట్విట్టర్ వంటి సోషల్ నెట్ వర్కింగ్ సైట్స్ ద్వారా ప్రచారంలోకి తేవటం మరీ ఎక్కువైంది. రీసెంట్ గా బాలీవుడ్ కథానాయిక సోనాక్షి సిన్హా తను టటూ వేయించుకుని మీరు చూస్తున్న ఫొటోని ట్వీట్ చేసింది.
సోమవారం సోనాక్షి 27వ పుట్టిన రోజును జరుపుకొంది. పుట్టిన రోజు బహుమతులు చాలానే వచ్చాయి. అయితే ఆమెకు ఆమే ఓ బహుమతి ఇచ్చుకొని తెగ ఆనందపడుతోంది. ఇంతకీ ఏమిటా బహుమతి.. అంటే ఆమె ఓ టాటూను కాలర్ బోన్ మీద వేయించుకొంది. ఇకపై తనతో జీవితాంతం ఆ టాటూ ఉండబోతోందనేది ఆమె ఆనందానికి కారణం.

''ఆశ్చర్యంగా ఉంది. నా పుట్టినరోజుకు నాకు నేను ఇచ్చుకొన్న ఈ టాటూ బహుమతి నాకు జీవితాంతం మార్గదర్శనం చేస్తుంది'' అని సోనాక్షి ట్విట్టర్‌లో పేర్కొంటూ తన టాటూ ఫొటోను కూడా పెట్టింది. తాజాగా ఆమె కథానాయికగా నటించిన చిత్రం 'హాలీడే'. ఎ సోల్జర్ ఈజ్ నెవర్ ఆఫ్‌డ్యూటీ అనే ఉప శీర్షికతో రూపొందింది. అక్షయ్ కుమార్ హీరో. ఎ.ఆర్.మురుగదాస్ దర్శకత్వం వహించారు. తెలుగులో వచ్చిన 'తుపాకీ' చిత్రానికిది రీమేక్.



Click it and Unblock the Notifications











