విడాకులు తీసుకున్న వ్యక్తితో సోనాక్షి డేటింగ్

సాధారణంగా సోనాక్షి తన పర్సనల్ విషయాలను రహస్యంగానే ఉంచుతుంది. అయితే ఎంత దాచినా బంటీతో వ్యవహారం మాత్రం అస్సలు దాగడం లేదు. పైగా బంటీ సచ్ దేవా సోనాక్షికి బావ వరుస అవుతాడు. సోనాక్షికి సంబంధించిన ఎండార్స్‌మెంట్ వ్యవహారాలు కూడా ఇప్పుడు అతనే చూసుకుంటున్నాడు.
ఇటీవల సోనాక్షి ఫాదర్ శత్రుజ్ఞ సిన్హా హాసుపత్రిలో జాయిన్ అయినప్పుడు అందరికంటే ముందు ఆసుపత్రికి వచ్చింది ఇతగాడే. ఆమె తండ్రికి ఇటీవల ఉన్నట్టుండి శ్వాస సమస్య ఏర్పడగానే ఏం చేయాలో తోచని సోనాక్షి వెంటనే తన లవ్వర్ బంటీకి ఫోన్ చేసి పిలిచిందని బాలీవుడ్లో చర్చించుకుంటున్నారు.
గతంలో బంటీ సుస్మితా సేన్, నేహా దూపియాలతో ప్రేమ వ్యవహారం నటిపించాడు. బంటీ మాజీ భార్య, మాజీ లవ్వర్ల గురించి సోనాక్షి వద్ద ప్రస్తావిస్తే అగ్గిమీద గుగ్గిలం అవుతోంది. అతనిపై ఎంత ప్రేమ లేకుంటే అంతలా రియాక్ట్ అవుతుంది?


Click it and Unblock the Notifications











