twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మరో బయోపిక్: దల్బీర్‌ కౌర్‌ గా సోనాక్షి సిన్హా ఎంపిక

    By Srikanya
    |

    ముంబై : బాలీవుడ్ లో ప్రస్తుతం బయోపిక్ ల టైమ్ నడుస్తోంది. స్టార్ హీరోలు, హీరోయిన్స్ కూడా ఆ పాత్రలపై ఆసక్తి చూపిస్తున్నారు. సోనాక్షి సిన్హా కూడా అలాంటి పాత్రతో రావటానికి సన్నాహాలు చేసుకుంటోంది. తాను ఎంచుకునే సినిమాల విషయంలో ఎంతో జాగ్రత్త తీసుకుంటూ, ఆయా పాత్రల్లో ఒదిగిపోతూ నటించే సోనాక్షి సిన్హా చేసింది తక్కువ సినిమాలే అయినా బాలీవుడ్‌లో ఒక స్థానాన్ని సంపాదించుకుంది. లుటేరా సినిమాలో పాఖి రాయ్‌ చౌదరి పాత్రలో మెప్పించిన ఈమె నటనకు పరీక్షపెట్టే మరో పాత్ర సోనాక్షిని వరించనుంది.

    గూఢాచారి అన్న ఆరోపణతో పాకిస్తానీ జైల్లో 22 సంవత్సరాల శిక్షను అనుభవించి ఈ మధ్యే మరణించిన సరబ్‌జీత్‌ సింగ్‌ జీవితాన్ని వెండి తెరపై చిత్రంగా మలచనున్నారు ప్రముఖ దర్శకుడు, నిర్మాత సుభాష్‌ ఘాయ్‌. సరబ్‌జీత్‌ సింగ్‌ను కారాగారం నుంచి విడుదల చేయడానికి ఎన్నో ప్రయత్నాలు చేసిన ఆయన సోదరి దల్బీర్‌ కౌర్‌ పాత్రను సోనాక్షి పోషించనున్నట్లు సమాచారం. ఈ చిత్రానికి కథను రాజేష్‌ బేరీ రాయగా, యాడ్‌ ఫిల్మ్‌మేకర్‌ ఈశ్వర్‌ సింగ్‌ దర్శకుడిగానూ, సుభాష్‌ ఘాయ్‌ ఈ చిత్రానికి నిర్మాతగానూ వ్యవహరించనున్నారు.

    భారత దేశం తరఫున గూఢాచారి అని, పాకిస్తాన్‌లో బాంబు పేలుళ్లకు పాల్పడి పలువురి ప్రాణాలు తీయడానికి కారకుడయ్యాడన్న అభియోగంపై పంజాబ్‌ రాష్ట్రానికి చెందిన సరబ్‌జీత్‌ సింగ్‌కు పాకిస్తాన్‌ ప్రభుత్వం మరణశిక్ష విధించింది. కానీ తన సోదరుడు ఏ తప్పు చేయలేదని, ఆయన్ని చెర నుంచి విడిపించడానికి సహాయం చేయమని ఆయన సోదరి అయిన దల్బీర్‌ కౌర్‌ సంబంధిత అధికారులను, మంత్రులను కలిసి ఎన్నో సార్లు విన్నవించుకుంది, న్యాయపరంగా కూడా పోరాటం చేసింది. ఎక్కే గడప, దిగే గడపగానే ఆమె సంవత్సరాల పోరాటం సాగింది.

    సరబ్‌జీత్‌ సింగ్‌ నిర్ధోషి అనడానికి ఆమె అనేక ఆధారాలు చూపించింది. ముక్కుపచ్చలారని ఆయన ఇద్దరు ఆడపిల్లలను, భార్య ముఖం చూసి అయినా కరుణించాలని ఎంతో మందికి విన్నవించుకుందీమె. సంవత్సరాల తరబడి ఈమె చేసిన పోరాట మధ్య కాలంలో రెండు దేశాల ప్రభుత్వాలు, ప్రధాన మంత్రులు కూడా మారారు కానీ సరబ్‌జీత్‌ కుటుంబం జాతకం మాత్రం మారలేదు.

    22 సంవత్సరాల అనంతరం ఈ సంవత్సరం ఏప్రిల్‌ 26వ తేదీన సరబ్‌జీత్‌ శిక్షను అనుభవిస్తున్న జైల్లోని సహఖైదీలు ఆయనపై ప్రాణాంతక దాడికి పాల్పడ్డారు. తీవ్రంగా గాయపడిన ఆయన తన 49 సంవత్సరాల వయస్సులో మే 2వ తేదీన కన్నుమూశారు. ఒక కుగ్రామంలో జన్మించి, పెద్దగా చదువు కూడాలేని దల్బీర్‌ పోరాటం ప్రతి మహిళకు స్ఫూర్తిదాయకం. మరి ఈ పాత్రలో సోనాక్షి ఏ విధంగా నటించి ప్రేక్షకులను మెప్పిస్తుందో చూడాలి.

    సరబ్‌జీత్‌ సింగ్‌ జీవితం, దీనితో ముడిపడి ఉన్న దల్బీర్‌ పోరాటం చాలా సున్నితమైన అంశమని, ఏ రకమైన వివాదాలకు తావివ్వకుండా దల్బీర్‌ జీవితాన్ని సుభాష్‌ ఘాయ్‌ తెరకెక్కించాలనుకుంటున్నట్లు ఆయన సన్నిహితులు అంటున్నారు. సరబ్‌జీత్‌ సింగ్‌ పాత్రను ఎవరు పోషించనున్నారో ఇంకా నిర్ధారించని ఈ చిత్రం వచ్చే సంవత్సరం షూటింగ్‌ జరుపుకోనున్నది.

    English summary
    Filmmaker Subhash Ghai is planning to make a film on slain Indian prisoner Sarabjit Singh, who spent 22-years in a Pakistan jail on espionage charges. Although the protagonist has not been finalised yet, the film will probably have Sonakshi Sinha, who will play Sarabjit's sister, Dalbir Kaur.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X