ఆ అన్నదమ్ములిద్దరూ కలిసి నన్ను పాడు చేశారు..!?
'ఆ అన్నదమ్ములిద్దరూ కలిసి నన్ను పాడు చేసేసారు" అంటూ ఆరోపణలు గుప్పిస్తోంది సొనాక్షి సిన్హా 'దబంగ్" అనే సినిమా ద్వారా హీరోయిన్ గా పరిచయమవుతున్న సొనాక్షి నిన్నటి టాప్ స్టార్ శత్రుఘ్నసిన్హా ముద్దుల కూతురు. ప్రస్తుతం రాజకీయాల్లో ప్రముఖంగా వెలుగొందుతున్న శత్రుఘ్నసిన్హా మీద గౌరవంతోనో, అభిమానంతోనో..'దబంగ్" చిత్రం కథానాయకుడైన సల్మాన్ ఖాన్, చిత్ర నిర్మాత అర్బాజ్ ఖాన్..సొనాక్షిపై ప్రత్యేక దృష్టి సారించి ఆమెకు ప్రత్యేక మర్యాదలు చేస్తూ..ఆమెను ఉక్కిరిబిక్కిరి చేసేస్తున్నారంట. అర్భాజ్ ఖాన్-సల్మాన్ ఖాన్ లు సోదరులన్న విషయం తెలిసిందే. తన అన్న సల్మాన్ ఖాన్ ను హీరోగా పెట్టి..అర్బాజ్ ఖాన్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో అర్బాజ్ ఖాన్ భార్య, సల్మాన్ ఖాన్ మరదలు అయిన మలైకా అరోరా ఓ ప్రత్యేకగీతం చేస్తుండడం తెలిసిందే.
తన పరిచయ చిత్రం 'దబంగ్" హీరో సల్మాన్ ఖాన్, నిర్మాత అర్బాజ్ ఖాన్ లు తనను ఎంతో గారాభంగా చూసుకుంటూ, కాలు కందనంతగా సపర్యలు చేయిస్తూ తనను పాడు చేసేస్తున్నారంటూ సొనాక్షి సిన్హా..ఈ సోదరులిద్దరిపైనా తీసి ఆరోపణలు గుప్పిస్తోంది. తమకు 'అన్ని విధాలా" సహాయసకారాలు అందించే సొనాక్షి లాంటి హీరోయిన్లను పాడు చేయడంలో మన హీరోలు, నిర్మాతలు ఎప్పుడూ ముందుంటారనే విషయం తెలిసిందే కదా?


Click it and Unblock the Notifications











