మహేష్ బాబు గురించి సోనాక్షి సిన్హా ట్వీట్
హైదరాబాద్: మహేష్ బాబు సరసన బాలీవుడ్ భామ సోనాక్షి సిన్హా నటినుందంటూ గత కొద్ది రోజులుగా అంతటా హాట్ టాపిక్ గా మారింది. క్రిష్ దర్శకత్వం వహించే చిత్రం 'శివం'. మహేష్ బాబు హీరో. సి.అశ్వనీదత్ నిర్మాత. హీరోయిన్ గా సోనాక్షిని ఎంచుకొన్నారు. ఈ విషయాన్ని ఆమె ట్విట్టర్ ద్వారా వెల్లడించింది.
సోనాక్షి ట్విట్టర్ లో... ''అవును. నేను మహేష్‌తో నటిస్తున్నా. దర్శకుడు చెప్పిన కథ చాలా బాగుంది. అందులో నా పాత్ర ఇంకా బాగా నచ్చింది. తొలిసారి తెలుగులో, అందులోనూ మహేష్ బాబు లాంటి హీరోతో నటించడం ఆనందంగా ఉంది''అని రాసుకొంది సోనాక్షి. ప్రస్తుతం మహేష్ బాబు-సుకుమార్ కలయికలో ఓ చిత్రం తెరకెక్కుతోంది.
మహేష్ సైతం క్రిష సినిమాను ఖరారు చేసారు. మహేష్ మాట్లాడుతూ ''శ్రీనువైట్ల దర్శకత్వంలో 'ఆగడు' సినిమా వచ్చే నెలలో ప్రారంభమవుతుంది. ఆ తర్వాత క్రిష్, వంశీ పైడిపల్లి, పూరి జగన్నాథ్‌ల దర్శకత్వంలో సినిమాలు చేస్తా. అవి పూర్తయ్యాక రాజమౌళి దర్శకత్వంలో ఓ సినిమా ఉంటుంది. కథ గురించి ఇదివరకే మాట్లాడుకొన్నాము''అని తెలిపారు.


Click it and Unblock the Notifications











