మహేష్ బాబుకు బిస్కట్ వేస్తున్న బాలీవుడ్ స్టార్ హీరోయిన్
అవకాశాలొస్తే తెలుగులో ముఖ్యంగా మహేష్ బాబు సరసన నటించాలని ఉందని అంటోంది దబాంగ్ హీరోయిన్ సోనాక్షిసిన్హా. రీసెంట్ గా హైదరాబాద్ లో ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చినప్పుడు ఆమె ఇలా ప్రకటన చేసింది.ఇది విని మహేష్ తన తదుపరి చిత్రంలో ఏమన్నా ఆఫర్ ఇస్తాడనే ఆశతో ఇలాంటి ప్రకటన చేసిందంటున్నారు.అయితే మహేష్ దీనిపై ఏమీ స్పందించలేదు.
ప్రస్తుతం ఆమె అక్షయ్‌కుమార్ సరసన 'జోకర్' సినిమాలో నటిస్తోంది.ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా సాగుతోంది.ఇక మహేష్ విషయానికి వస్తే దూకుడు చిత్రం షూటింగ్ లో బిజీగా ఉన్నాడు.శ్రీను వైట్ల దర్సకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో సమంత హీరోయిన్ గా చేస్తోంది.ఈ చిత్రం అనంతరం మణిరత్నం దర్సకత్వంలో ఓ చిత్రం కమిటయ్యాడు.


Click it and Unblock the Notifications











