ప్రముఖ క్రికెటర్ మాయలో బాలయ్య హీరోయిన్... నిధి అగర్వాల్ తర్వాత మరో లింకు!

Recommended Video

Actress Sonal Chauhan Has Rubbished Link-Up Rumours With Cricketer KL Rahul??

సినీ తారలు, క్రికెటర్ల మధ్య అఫైర్లు, రిలేషన్‌ అంశాలు కొత్తేమీ కాదు. వారి మధ్య లింకులపై మీడియాలో అనేక రూమర్లు వస్తుంటాయి. అయితే వాటిపై తారలు పెద్దగా స్పందించరు. కానీ క్రికెటర్ కేఎల్ రాహుల్‌తో లింకు పెట్టి తనపై వస్తున్న రూమర్లకు బాలీవుడ్ నటి సొనాల్ చౌహాన్ క్లారిటీ ఇచ్చారు. గతంలో పలువురు బాలీవుడ్ హీరోయిన్లతో కేఎల్ రాహుల్‌కు అఫైర్లు ఉన్నాయంటూ వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా రాహుల్‌ జాబితాలో మరో బాలీవుడ్ తార చేరడం చర్చనీయాంశమైంది. వివరాల్లోకి వెళితే..

కేఎల్ రాహుల్‌తో డేటింగ్ అంటూ

కేఎల్ రాహుల్‌తో డేటింగ్ అంటూ

క్రికెటర్ కేఎల్ రాహుల్‌తో డేటింగ్ చేస్తున్నారా? అంటూ అడిగిన ప్రశ్నకు సొనాల్ చౌహాన్ స్పందిస్తూ.. అలాంటిదేమీ లేదు. ఆయన మంచి క్రికెటర్. ప్రతిభావంతుడు. చాలా మంచివాడు. మా మధ్య అఫైర్ వార్తల్లో వాస్తవం లేదు. అవన్నీ మీడియా కల్పితాలే అని అన్నారు. మా మధ్య అలాంటి రిలేషన్ లేదంటూ డేటింగ్ వార్తలను ఆమె తోసిపుచ్చింది.

నిధి అగర్వాల్‌తో కూడా అఫైర్ అని

నిధి అగర్వాల్‌తో కూడా అఫైర్ అని

గతంలో దక్షిణాది హీరోయిన్ నిధి అగర్వాల్‌తో కేఎల్ రాహుల్ డేటింగ్ చేస్తున్నట్టు వార్తలు వచ్చాయి. అయితే వాటిలో నిజం లేదని తెలియడంతో ఆ వార్తలకు తెరపడింది. ఆ తర్వాత అలియాభట్ బెస్ట్ ఫ్రెండ్ ఆకాంక్ష రంజన్‌తో క్రికెటర్ రాహుల్‌కు లింకు పెడుతూ మరోసారి వార్తలు స్వైర విహారం చేశాయి. అయితే వాటిని ఎవరూ పెద్దగా పట్టించుకొన్న దాఖలాలు లేవు.

ప్రపంచ కప్‌పై కేఎల్ రాహుల్ దృష్టి

ప్రపంచ కప్‌పై కేఎల్ రాహుల్ దృష్టి

కాగా, ప్రస్తుతం కేఎల్ రాహుల్ ఇంగ్లాండ్‌లో జరుగుతున్న ప్రపంచ క్రికెట్ కప్ మ్యాచ్‌లతో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం పూర్తి స్థాయిలో తన కెరీర్ మీదే దృష్టిపెట్టాడు. ఆఫర్లు, డేటింగ్ వార్తలకు దూరంగా ఉంటున్నాడు. గతంలో కరణ్ జోహర్ చాట్ షోలో మహిళల మనోభావాలు దెబ్బతినే విధంగా కామెంట్లు చేసి వివాదంలో ఇరుక్కొన్న సంగతి తెలిసిందే.

ఆఫర్లు లేక సోనాల్ చౌహాన్

ఆఫర్లు లేక సోనాల్ చౌహాన్

ఇదిలా ఉండగా, సోనాల్ చౌహన్ జన్నత్ చిత్రం తర్వాత పెద్దగా ఆఫర్లు దక్కించుకొన్నట్టు కనిపించలేదు. జన్నత్ చిత్రంలో హాట్ హాట్‌గా నటించినప్పటికీ.. బాలీవుడ్ నిర్మాతలు పెద్దగా ఆమెకు ఆఫర్లు కట్టబెట్టలేదు. అందుకు తాను ఎవరిని నిందించలేను. ఎవరిపైనా ఫిర్యాదు చేయను. మంచి అవకాశాల కోసం ఎదురుచూస్తున్నాను. నాకు నచ్చే చిత్రం కోసం ఎంతకాలమైనా వెయిట్ చేస్తాను అని సొనాల్ చౌహాన్ తెలిపారు. తెలుగులో బాలకృష్ణతో కలిసి లెజెండ్, డిక్టేటర్ చిత్రాల్లోనూ.. అలాగే పండుగ చేస్కో, సైజ్ జీరో చిత్రాల్లో కనిపించింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X