»   » బాలయ్యను బాగా వాడుకుంటోన్న సెక్సీలేడీ (ఫోటోలు)

బాలయ్యను బాగా వాడుకుంటోన్న సెక్సీలేడీ (ఫోటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: హీరోయిన్ సోనాల్ చౌహాన్. రెయిన్‌బో అనే ఓ ప్లాపు తెలుగు చిత్రంలో నటించినప్పటికీ ఈమె గురించి చాలా మంది తెలుగు ప్రేక్షకులకు తెలియదు. అయితే తాజాగా ఆమె బాలయ్య హీరోగా తెరకెక్కిన 'లెజెండ్' చిత్రం చేయడంతో అమ్ముడుకి తెలుగునాట ఎక్కడలేని గుర్తింపు వచ్చింది. ఈ చిత్రంలో అమ్మడు బికినీ ధరించి హాట్ హాట్ సీన్లలో బాలయ్య అభిమానులను అలరించిన విషయం తెలిసిందే.

ఇదే అదునుగా బాలయ్య పేరును వాడుకుంటూ తెలుగులో మరిన్ని అవకాశాలు దక్కించుకునే ప్రయత్నం మొదలు పెట్టింది. పలువురు దర్శక నిర్మాతలను కలవడంతో పాటు, పాత్రను బట్టి ఎంత ఎక్స్ ఫోజింగ్ చేయడానికైనా బాగా తాను సిద్ధమే అని ప్రకటించింది. లెజెండ్ చిత్రం విజయం నాకు ఆక్సిజన్ లా పని చేస్తుందని, వరుస చిత్రాలు చేస్తూ ఇక్కడే సెటిలవ్వాలని తన మనసులోని మాట బయట పెట్టింది.

సోనాల్ చౌహాన్‌కు సంబంధించిన మరిన్ని వివరాలు స్లైడ్ షోలో....

మోడలింగ్ నుండి

మోడలింగ్ నుండి

స్వతహాగా మోడల్ అయిన సోనాల్ చౌహాన్ అప్పుడెప్పుడో 2008లో వచ్చిన కిస్సుల కింగ్ ఇమ్రాన్ హస్మి చిత్రం ‘జన్నత్' చిత్రం ద్వారా వెండితెరంగ్రేటం చేసింది. ఆ చిత్రం బాక్సాఫీసు వద్ద బోల్తా పడింది.

తెలుగులో...

తెలుగులో...

సోనాల్ చౌహాన్ రెండో చిత్రం తెలుగులో నటించిన రోయిన్ బో, దీంతో పాటు కన్నడంలో, హిందీలో నటించిన రెండు చిత్రాలు బాక్సాఫీసు వద్ద అడ్రస్ లేకుండా పోవడంతో అమ్మడి కెరీర్ చాలా చాలా స్లో అయిపోయింది.

బుడ్డా హోగా తెరా బాప్

బుడ్డా హోగా తెరా బాప్

పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన బుడ్డా హోగా తెరాబాప్ చిత్రం హిట్టయినప్పటికీ ఆ సినిమా క్రెడిట్ అంతా అమితాబ్ బచ్చన్‌కే పోయింది.

గ్లామర్ డోసు పెంచింది

గ్లామర్ డోసు పెంచింది

కేవలం నటననే నమ్ముకుంటే లాభం లేదని భావించిన సోనాల్ .... గ్లామర్ డోసు పెంచింది. ‘3జి' అనే సినిమాలో అవకాశం రావడంతో ఇదే అదునుగా అందాల విశ్వరూపం చూపాలని నిర్ణయించుకుంది. ఈ చిత్రంలో సోనాల్ చౌహాన్ బికినీ అందాలతో రెచ్చి పోవడంతో పాటు, ఈచిత్రంలో తన కోస్టార్ నీల్ నితిన్ ముఖేష్‌తో ఏకంగా 30 లిప్ లాక్ ముద్దు సీన్లు చేసిందట.

లెజెండ్‌తో తొలి హిట్

లెజెండ్‌తో తొలి హిట్

హీరోయిన్ సోనాల్ చౌహాన్‌కు కెరీర్లో ‘లెజెండ్' చిత్రం తొలి హిట్. దీంతో ఇదే సరైన సమయం అని అవకాశాలు దక్కించుకోవడానికి తన ప్రయత్నాలు మొదలు పెట్టింది.

English summary
Bollywood actress Sonal Chauhan has become popular with super hit films ‘Jannat’ and ‘Budda Hoga Tera Baap’ earlier and now, she has come out glamorous once again with ‘Legend’ starred Balakrishna, and this time in Telugu.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu