మహేష్ హీరోయిన్ శ్రీరంగనీతులకు నవ్వులు
సినిమాల్లో నైతిక విలువలు దారుణంగా పడిపోయాయి. కొన్ని సినిమాల్లో సీన్స్ చూస్తోంటే... వీళ్లు ఆడవాళ్లేనా అనిపిస్తోంది. కొన్నాళ్లక్రితం ఎక్స్‌పోజింగ్ అంటే... గ్లామర్ కోసమే అన్నట్టు ఉండేది. ఇప్పుడది వల్గారిటీ రేంజ్‌కి దిగజారిపోయింది. మరింత పతనావస్థకు చేరుకునే అవకాశం కూడా కనిపిస్తోంది. అందుకే సినిమాలకు దూరంగా ఉండాలనుకుంటున్నాను అంటోంది సొనాలి బింద్రే. మురారిలో మహేష్ ప్రక్కన చేసిన ఆమె ఆ తర్వాత ఇంద్ర, మన్మధుడు, శంకర్‌దాదా ఎంబీబీఎస్ లాంటి చిత్రాల్లో చేసింది. ఆ చిత్రాల్లో మీరు కూడా గ్లామర్ పాత్రలే చేసారు కదా అంటే...మీరు చెప్పిన సినిమాల్లో నా పాత్రల ప్రాధాన్యతను ఒక్కసారి గుర్తుచేసుకోండి.
అందాన్ని అందంగా చూపించాను కాని... అసహ్యంగా చూపించలేదు. పరిధిదాటి నేనెప్పుడూ ప్రవర్తించలేదు. అందుకు నా గత చిత్రాలే నిదర్శనాలు అంది. ఇక పెళ్లయ్యాక సినిమాలకు దూరంగా ఉంటున్న సొనాలీబింద్రే.. ఇటీవల ఓ వాణిజ్య ప్రకటనలో సంప్రదాయబద్ధంగా దర్శనమిచ్చింది.అలాగే ఆమె మీద భ్రమ తీరని ఓ ప్రముఖ యంగ్ హీరో ఆమెను తన సినిమాలో నటింపజేయాలని ప్రయత్నాలు చేసాడు. కానీ సొనాలీ మాత్రం మళ్లీ సినిమాల్లో నటించడానికి సుముఖంగా లేదని తోసి పుచ్చింది. ప్రస్తుతం రియాలిటీ షో లతో, యాడ్ లతో ఆమె తనను తాను బిజీ గా ఉంచుకుంటోంది.


Click it and Unblock the Notifications











