ప్రిన్స్ హరోయిన్ సోనాలి బింద్రే మళ్ళి వస్తోంది..
టాలీవుడ్ లో మురారీ, ఇంద్ర, పలనాటి బ్రహ్మానాయుడు, చిరంజీవి, బాలకృష్ణ, మహేష్ బాబు వంటి స్టార్స్ ల సినిమాలలో హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకొన్న నటి సోనాలి బింద్రే. వివాహం అయిన తర్వాత సినిమాలకు స్వస్తి చెప్పడం నాయికలకు మామూలే. అయితే ఎవరి విషయంలో ఆ వీడ్కోలు శాశ్వతంకాలేదు. ఏదో ఓ కారణం చెప్పి మొహానికి రంగులద్దుకున్నవారు వున్నారు. అలా పెళ్ళి చేసుకొని నటనకు దూరమైన సోనాలి బింద్రే మళ్ళి నటిస్తానంటున్నారు.
నిర్మాత గోల్డిబెల్ ను వివాహం చేసుకున్న తరువాత సినిమాలకు క్రమంగా దూరమైంది. అయితే మరోసారి వెండితెర మీదకు వచ్చేందుకు రంగం సిద్దం చేసుకుంటున్నారు. అలాగే తన నిర్మాణసంస్ధ ద్వారా సినిమాలు కుడా నిర్మించే ఆలోచనలో వున్నారామే.
సోనాలి బింద్రే మహేష్ బాబు చిరంజీవి బాలకృష్ణ మురారి ఇంద్ర sonali bendre mahesh babu chiranjeevi balakrishna murari


Click it and Unblock the Notifications