»   » మహేష్ హీరోయిన్...మోడలింగ్ చేసే రోజుల్లో... (లీక్ ఫొటోలు) ,వెనక ఆలోచన ఏంటి?

మహేష్ హీరోయిన్...మోడలింగ్ చేసే రోజుల్లో... (లీక్ ఫొటోలు) ,వెనక ఆలోచన ఏంటి?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మీకు గుర్తుందా... మహేష్ బాబుతో మురారి, చిరంజీవితో ఇంద్ర చిత్రాలు చేసిన సోనాలి బింద్రే తెలుగులో ఒకానొక టైమ్ లో బిజీ హీరోయిన్. అయితే ఆ తర్వాత పెళ్ళి చేసుకుని సినిమాలకు దూరమైంది. అయితే ఆ రోజుల్లో అంటే సినిమాల్లోకి రాకముందు సోనాలి..మోడలింగ్ చేసేది.

మోడలింగ్ చేసే రోజుల నాటి ఫొటోలు రీసెంట్ గా బయిటకు వచ్చాయి. ఈ ఫొటోలు చూసిన వారు మరోసారి తమ స్వప్న సుందరిని గుర్తు చేసుకుంటున్నారు. ఆమె ఎందుకు బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ అనే తేడాలేకుండా ఏలిందో...ఈ ఫొటోలు చూస్తే అర్దం అవుతుంది. అయితే ఈ ఫొటోలు ఇంత లేటుగా బయిటకు రావటం అందరినీ ఆశ్చర్యంలో పడేస్తున్నాయి. సోనాలి కావాలని రీ ఎంట్రీ కోసం ప్రయత్నం చేయటంలేదు కదా..

సోనాలి ఈ మధ్యన మీడియాతో మాట్లాడుతూ... ''మా మదర్ చాలా విషయాల్లో స్ట్రిక్ట్ గా ఉండేది. ముఖ్యంగా ఎవరైనా మా అక్కచెళ్లిళ్లలో ఎవరైనా అందంగా ఉన్నామని పొగిడితే ఆ డిస్కషన్ ని కట్ చేసేది. అటువంటి వాటిని ఎంకరేజడ్ చేసేది కాదు. కానీ ఒక విషయంలో మాత్రం మా అమ్మ చాలా క్లియర్ గా ఉండేది. తన కూతుళ్లు మాత్రం హౌస్ వైఫ్ లు కాకూడదని అనేది , '' అంటూ తన మోడలింగ్ నాటి నేపధ్యం చెప్పుకొచ్చింది.

అలాగే... సినిమాల్లో నైతిక విలువలు దారుణంగా పడిపోయాయి. కొన్ని సినిమాల్లో సీన్స్ చూస్తోంటే... వీళ్లు ఆడవాళ్లేనా అనిపిస్తోంది. కొన్నాళ్లక్రితం ఎక్స్‌పోజింగ్ అంటే... గ్లామర్ కోసమే అన్నట్టు ఉండేది. ఇప్పుడది వల్గారిటీ రేంజ్‌కి దిగజారిపోయింది. మరింత పతనావస్థకు చేరుకునే అవకాశం కూడా కనిపిస్తోంది. అందుకే సినిమాలకు దూరంగా ఉండాలనుకుంటున్నాను అంటోంది సొనాలి బింద్రే.

తెలుగులోనే కాదు

తెలుగులోనే కాదు

సోనాలి బింద్రే సోనాలి బింద్రే కేవలం టాలీవుడ్‌ నటేకాదు. హిందీ, తమిళ, మరాఠీ సినిమాల్లో కూడా ఒక వెలుగు వెలిగిన అందాల నటి.

స్టార్ డమ్

స్టార్ డమ్

''సర్ఫరోస్‌'' సినిమా బింద్రేకు మంచి స్టార్డమ్‌ తెచ్చి పెట్టింది.

తెలుగులో....

తెలుగులో....

'మురారి', 'ఇంద్ర', 'మన్మధుడు', 'ఖడ్గం', 'శంకర్‌ దాదా ఎమ్‌బిబిఎస్‌' సినిమాలు ఆమెకు మంచి పేరు తెచ్చి పెట్టాయి.

ఈ సినిమాతోనే స్వస్ది

ఈ సినిమాతోనే స్వస్ది

శంకర్‌దాదా ఎమ్‌బిబిఎస్‌ సినిమా తర్వాత సోనాలి సినిమాల్లో నటించడం మానేసింది.

దర్శకుడుతో వివాహం

దర్శకుడుతో వివాహం

2002లో ప్రముఖ బాలీవుడ్‌ దర్శకుడు గోల్డీ బెహల్‌ను పెళ్ళాడింది.

కుమారుడు

కుమారుడు

ఆమెకి 2005లో రణవీర్‌ జన్మించాడు.

అందుకే స్వస్ది

అందుకే స్వస్ది

బాబు ఆలనా పాలనా చూసుకునేందుకు సోనాలీ సినిమా నటనకు స్వస్తి పలికింది.

భయం తెలిసింది

భయం తెలిసింది

''తల్లిని కాక ముందు నాకు భయమంటే తెలియదు. రణవీర్‌కి జన్ననిచ్చాక భయమంటే తెలిసింది అంటుంది సోనాలి

అవన్నీ చూస్తేనే భయం

అవన్నీ చూస్తేనే భయం

అభం శుభం తెలియని పిల్లలు చదువుకొనే పాఠశాలల్లో బాంబులు పేల్చడం, పిల్లల్ని కిడ్నాప్‌ చేయడం వంటి వికృత చేష్టలు చూస్తుంటే భయమేస్తూ వుంటుంది.

జాగ్రత్తలు

జాగ్రత్తలు

అందుకే మా మాబు రణవీర్‌ చదివే స్కూలులో మా సినీ నేపథ్యం గురించి తెలియకుండా జాగ్రత్త పడుతుంటాను.

మా సయమం

మా సయమం

దాంతో బాబుని జాగ్రత్తగా పెంచుకోవటంలోనే మా సమయం మొత్తం గడుస్తోంది'' అని చెప్పుకొచ్చింది సోనాలీ బింద్రే.

తల్లిగా,భార్యగా

తల్లిగా,భార్యగా

రణవీర్‌కు అన్ని విధాలా సహాయపడుతూ బంగారు తల్లిగా గోల్డీ బెహల్‌ నుంచి మన్ననలు అందుకుంటోంది

పుస్తకం కూడా

పుస్తకం కూడా

సోనాలీ ఇప్పుడు ఒక పుస్తకం రాసే పనిలో పడింది.

గతంలో కూడా...

గతంలో కూడా...

ఆమె 'ది మోడరన్‌ గురుకుల్‌- మై ఎక్స్‌పెరిమెంట్స్‌ విత్‌ పేరెంటింగ్‌' అనే పుస్తకాన్ని ప్రచురించింది. అందులోనూ తల్లి పాత్ర మీదే ఆ రచన సాగింది.

ఖాళీ

ఖాళీ

కొడుకు పెద్దవటంతో ఆమె ఖాళీ అయిపోయింది. దాంతో ఆమెకు మళ్ళీ వెండితెరపై రీ ఎంట్రీ ఇవ్వాలనే కోరిక మొదలైంది.

మారిన రూపం

మారిన రూపం

అయితే ఇప్పుడామె రూపం మారిపోయింది. చాలా లావుగా తయారైన ఆమెకు స్లిమ్ అయి కనిపించమని పరిచయ దర్శక,నిర్మాతలు సలహా ఇస్తున్నారు.

పాత ఫిగర్ కోసం

పాత ఫిగర్ కోసం

దాంతో ఇప్పుడామె రోజూ జిమ్, ఆహార నియమాలు అంటూ పాత ఫిగర్ తెచ్చుకునే పనిలో పడింది.

ఆచితూచి

ఆచితూచి

ఇక ఇప్పటికే ఆమె రెండు తెలుగు సినిమాలు, ఒక హిందీ సినిమా ఆఫర్స్ వచ్చినా ఆచితూచి అడుగులు వెయ్యాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

అయితే ....

అయితే ....

హీరోయిన్ గా మాత్రం ఆమెను తీసుకుని ఉండరు.ఏ అక్కో,అత్తో రోల్స్ కో ఆమెను అడుగుతారని చెప్తున్నారు.

యాడ్స్ లోనూ..

యాడ్స్ లోనూ..

సొనాలీబింద్రే.. ఆ మధ్యన ఓ వాణిజ్య ప్రకటనలో సంప్రదాయబద్ధంగా దర్శనమిచ్చింది.

తోసిపుచ్చింది

తోసిపుచ్చింది

అలాగే ఆమె మీద భ్రమ తీరని ఓ ప్రముఖ యంగ్ హీరో ఆమెను తన సినిమాలో నటింపజేయాలని ప్రయత్నాలు చేసాడు. కానీ సొనాలీ మాత్రం మళ్లీ సినిమాల్లో నటించడానికి సుముఖంగా లేదని తోసి పుచ్చింది.

ప్రస్తుతం...

ప్రస్తుతం...

రియాలిటీ షో లతో, యాడ్ లతో ఆమె తనను తాను బిజీ గా ఉంచుకుంటోంది.

English summary
Here are some beautiful modelling days pictures of Sonali Bendre which will make you understand why she was so popular. Click on VIEW PHOTOS to go through all the slides.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu