‘మన్మధుడు’ హీరోయిన్ గ్యాప్ వచ్చినా మళ్ళీ మొదలెట్టింది
'ఇంద్ర" 'ఖడ్గం" 'మురారి" 'మన్మధుడు" 'శంకర్ దాదా ఎంబిబిఎస్" వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయిన సోనాలీ బింద్రే ఆ మధ్యన వివాహం చేసుకుని దూరమైంది. అయితే మళ్ళీ ఇన్నాళ్ళకు ఆమెకు తనను తాను తెరపై చూడాలని కోరిక పుట్టినట్లుంది. అందుకోసం ఆమె రీఎంట్రీకి రెడీ అయ్యానని నిర్మాతలకు, దర్శకులకు కబుర్లు పంపుతోంది. అయితే ఎవరూ హీరోయిన్ గా తిరిగి ఛాన్స్ ఇవ్వరు కాబట్టి మంచి క్యారెక్టర్స్ అయినా ఫరవాలేదంటోంది. అలాగే తనలో ఇంకా సెక్సప్పీల్ పోలేదని దాన్ని దృష్టిలో ఉంచుకుని పాత్రలు డిజైన్ చేస్తే ఇంకా బెస్ట్ అని సలహాలు ఇస్తోంది. ప్రస్తుతం ఆమె డాక్టర్ మార్పిన్ అనే హెల్త్ ప్రొడక్ట్స్, డయోగోస్టిక్ ఎక్విప్ మెంట్ కంపెనీకు బ్రాండ్ అంబాసిడర్ గా సైన్ చేసింది.మరి మన దర్సకులు ఏమన్నా పాత పరిచయాలు గుర్తు చేసుకుని ఆమెకు అవకాశమిస్తే కాస్త మళ్ళి పట్టాలెక్కుతుంది.


Click it and Unblock the Notifications











