Sonali Phogat: సోనాలి ఫోగట్​ను మృతి కేసులో కీలక మలుపు.. ఆమెను రేప్​ చేశారని ఆరోపణ

టిక్​టాక్​ స్టార్​, బీజేపీ నేత సోనాలి ఫోగట్​ మృతి కేసు కీలక మలుపులు తిరుగుతోంది. ముందుగా పోలీసులు, వైద్యులు ఆమెది గుండెపోటుగా భావించినా, కుటుంబ సభ్యులు మాత్రం హత్యేనని గోవా పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. అయితే సోనాలి ఫోగట్​ అసిస్టెంట్​ సుధీర్​ సాంగ్వాన్​, అతని స్నేహితుడు సుఖ్వీందర్​ కలిసి ఆమెను రేప్​ చేసి తర్వాత హత్య చేసినట్లు ఆమె సోదరుడు సోదరుడు రింకు ధాకా తాజాగా గోవా పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ఏన్​ఎఐ పేర్కొంది.

బీజేపీ నేత, టిక్​టాక్​ స్టార్​ అయిన సోనాలి ఫోగట్​ ఆగస్టు 23న గోవాలో మరణించింది. ఆమెది గుండేపోటుగా భావించారు పోలీసు, వైద్యులు. కానీ సోనాలి ఫోగట్​ది హత్యేనని కుటుంబ సభ్యులు గోవా పోలీసులకు ఫిర్యాదు చేశారు. అలాగే ఆమె పోస్ట్​మార్టం నివేదికలో వెల్లడైన ఆధారాలతో గోవా పోలీసులు హత్య నేరం కింద కేసు నమోదు చేశారు. గోవాలో సోనాలి ఫోగట్​తో పాటు ఉన్న ఆమె అసిస్టెంట్​ సుధీర్ సాంగ్వాన్, అతని స్నేహితుడు సుఖ్వీందర్​లను నిందితులుగా చేరుస్తూ ఐపీసీ 302 సెక్షన్​ ప్రకారం పోలీసులు ఎఫ్​ఐర్​ నమోదు చేశారు. అయితే ఆమ శరీరంపై మొద్దు బారిన గాయాలు ఉన్నట్లు తేలడంతో పోలీసులు హత్యగా భావిస్తున్నారు.

Sonali Phogat Family Alleges She Was Raped By Her Assistant Before Murder

అయితే సోనాలి ఫోగట్ మరణానికి కొన్ని గంటల ముందు రోజు తన అసిస్టెంట్​ సుధీర్​ సాంగ్వాన్​తో ప్రమాదం పొంచి ఉందని తనతో చెప్పినట్లు రింకూ ధాకా తెలిపాడు. అలాగే తనకు డ్రగ్స్​ ఇచ్చి తర్వాత రేప్ చేసి, ఆ వీడియోను చిత్రీకరించినట్లు ఆమె చెప్పిన్లు రింకూ తెలిపాడు. ఈ వీడియోను సోషల్ మీడియాలో పెట్టి వైరల్​ చేస్తామని బెదిరించినట్లు తాజాగా ఇచ్చిన పోలీసు ఫిర్యాదులో పేర్కొన్నాడు రింకూ ధాకా. ఈ ఫిర్యాదులో ''సోనాలి ఫోగట్​ తినే భోజనంలో డ్రగ్స్ కలిపి స్పృహ తప్పిపోయేలా చేశారు. అనంతరం రేప్ చేసి ఈ హత్య చేశారు. ఆమె మరణానికి కొన్నిగంటల ముందు తనకు డ్రగ్స్​ ఇచ్చి రేప్​ చేసినట్లు ఆమె మాతో (కుటుంబసభ్యులు) తెలిపింది.

అంతేకాకుండా సోనాలి రాజకీయ జీవితాన్ని నాశనం చేస్తానని ఆమె పీఏ సుధీర్​ సాంగ్వాన్ బెదిరించాడు. అలాగే ఆమె ఫోన్​, ఆస్తులు, బ్యాంక్​ అకౌంట్స్​ సీజ్ చేస్తామని, ఇల్లు లాక్కుంటామని భయపెట్టాడు'' అని ఉన్నట్లు ఏఎన్​ఐ ఆర్టికల్​ ద్వారా తెలుస్తోంది. అలాగే సోనాలి ఫోగట్ మేనల్లుడు మొనిందర్ ఫోగట్​ కూడా ఆమె హత్యపై మాట్లాడాడు. ''మా అక్కను రేప్​ చేసే చంపారని మేము కచ్చితంగా చెప్పగలం'' అని మొనిందర్ తెలిపాడు.

హర్యానాలోని హిసార్​కు చెందిన బీజేపీ నేత సోనాలి ఆగస్టు 22న గోవా వెళ్లింది. తర్వాత 23వ తేదిన ఆరోగ్యం క్షీణించిందంటూ గోవాలోని అంజునా ప్రాంతంలోని హాస్పిటల్​లో చేర్చారు. అయితే చికిత్స పొందుతూ సోనాలి మృతిచెందడంతో మొదటగా ఆమె చావుకు కారణం గుండెపోటు అని ప్రాథమికంగా వైద్యులు నిర్ధరించారు. కానీ సోనాలి ఫోగట్ కుటుంబ సభ్యులు మంగళవారం రాత్రి గోవాకు చేరుకున్నారు. ఆమెది గుండెపోటు కాదని, ఆమెతో ఉండే ఇద్దరు వ్యక్తులే హత్య చేశారని ఆరోపించారు. అనంతరం బుధవారం గోవా పోలీసులకు సోనాలి ఫోగట్ సోదరుడు ఫిర్యాదు చేశాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X