Sonali Phogat: సోనాలి ఫోగట్​ను ఆస్తి కోసమే చంపారా? ఆమె కూతురికి సైతం ప్రాణ హానీ!

బిగ్​బాస్ రియాలిటీ షోతో ఎంతోమంది ఫేమస్​ అయ్యారు. సెలబ్రిటీ రేంజ్​ను సంపాందించుకున్నారు. అలాంటివారిలో సోనాలి ఫోగట్​ ఒకరు. హిందీ బిగ్​బాస్​ 14వ సీజన్​ కంటెస్టెంట్​గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్న ప్రముఖ సినీ నటి, రాజకీయ నాయకురాలు సోనాలి ఫోగాట్​ ఇటీవల మరణించిన విషయం తెలిసిందే. గోవా ట్రిప్​కు వెళ్లిన సోనాలి ఫోగట్​ హఠాత్తుగా మరణించడం సంచలనంగా మారింది. ఆమె మరణంపై జరిపిన విచారణ అనేక మలుపులు తిరిగింది. ఇప్పుడు తాజాగా ఆమె మరణం వెనుక ఎవరున్నారు? ఆమెది హత్యేనా? ఎందుకోసం చంపారు? అలాగే ఆమె వారసురాలు యశోధరకు ప్రాణ హాని ఉందా? అనే విషయాలు తెరమీదకు వస్తున్నాయి.

ఎవరున్నారు?

ఎవరున్నారు?

హిందీ బిగ్​బాస్​ 14వ సీజన్​ కంటెస్టెంట్​, హరియాణా బీజేపీ నేత, నటి సోనాలి ఫోగట్​ (43) అనుమానస్పదంగా మరణించడం సంచలనంగా మారింది. ఆమె మృతిపై మిస్టరీ వీడటం లేదు. అనేక మలుపుల తర్వాత ఆమె మరణం హత్యగా నిర్ధారణ కావడంతో దేశవ్యాప్తంగా సెన్సేషన్​ అయింది. ఇదిలా ఉంటే అసలు సోనాలి ఫోగట్​ హత్య వెనుక ఎవరున్నారు? ఎందుకు చంపారన్న విషయాలు ప్రస్తుతం చర్చనీయాంశమయ్యాయి.

 రూ. 110 కోట్ల ఆస్తికి వారసురాలు..

రూ. 110 కోట్ల ఆస్తికి వారసురాలు..

ఈ నేపథ్యంలోనే సోనాలి ఫోగట్​ను ఆస్తి కోసమే హత్య చేశారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అలాగే సోనాలి ఫోగట్ రూ. 110 కోట్ల విలువైన ఆస్తికి ఆమె కుమార్తే యశోధర వారసురాలు. ఆమెకు కూడా ప్రస్తుతం ప్రాణ హానీ ఉందని ఆమె కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు. 2016లో సోనాలి ఫోగట్​ భర్త సంజయ్ ఫోగట్​ సైతం ఇదే రీతిలో అనుమానాస్పదంగా మరణించాడు.

యశోధరకు 15 ఏళ్లు..

యశోధరకు 15 ఏళ్లు..

2016లో సంజయ్​ ఫోగట్, ఇప్పుడు సోనాలి ఫోగట్​ ఇద్దరూ అనుమానాస్పద స్థితిలో మరణించడంతో ఆమె కుటుంబ సభ్యులు ఆందోళ చెందుతున్నారు. ఇప్పుడు సోనాలీ కూతుర యశోధరను కూడా హత్య చేయొచ్చని వారు బాధపడుతున్నారు. ప్రస్తుతం యశోధరకు 15 సంవత్సరాలు. ఈమెకు ప్రాణ ముప్పు ఉందన్న కారణంగా యశోధరను తిరిగి హాస్టల్​కు పంపించొద్దని కుటుంబీకులు నిర్ణయించారు.

సీబీఐకి అప్పజెప్పాలి..

సీబీఐకి అప్పజెప్పాలి..

ఇప్పటికే యశోధరకు భద్రత కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. మరోవైపు తన తల్లి హత్య కేసును సీబీఐకి అప్పగించాలని యశోధర డిమాండ్​ చేస్తోంది. ''నా తల్లిని ప్లాన్ ప్రకారే హత్య చేశారని అనడంలో ఎలాంటి సందేహం లేదు. గోవాలో వారం రోజులపాటు షూటింగ్ ఉందని అమ్మ నాతో చెప్పింది. మరి అలాంటప్పుడు రిసార్ట్​ను కేవలం రెండు రోజులకే ఎందుకు బుక్​ చేశారు? పక్కా పథకం ప్రకారమే అమ్మను హత్య చేశారు.

 నేను సంతృప్తిగా లేను..

నేను సంతృప్తిగా లేను..

అయినా ఇప్పటివరకు మా అమ్మ హత్యకు గల కారణాలను పోలీసులు నిర్ధారించలేదు. గోవా పోలీసుల దర్యాప్తు నాకు సంతృప్తికరంగా లేదు. ఈ దర్యాప్తుపై అనేక సందేహాలు ఉన్నాయి. అందుకే ఈ కేసును సీబీఐకి అప్పగించాలని కోరుతున్నా'' అని సోనాలి ఫోగట్​ కుమార్తె యశోధర తెలిపింది. కాగా ఆగస్టు 22న సోనాలి ఫోగట్​ తన మేనేజర్​ సుధీర్ సాంగ్వాన్​తో పాటు మరొకరితో కలిసి గోవాకు వెళ్లిన విషయం తెలిసిందే. ​

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X