వాళ్ల బంధం చెడటానికి ఆవిడే కారణమా?
బాలీవుడ్ హాట్ బ్యూటీ దీపిక పడుకోనె, సిద్ధార్థ మాల్యా మధ్య ఎఫైర్ ఉందని ఎప్పటి నుంచో బాలీవుడ్‌లో వినిపిస్తున్న వార్త. రణబీర్ కపూర్ తో ప్రేమ వ్యవహారం బెడిసికొట్టిన తర్వాత దీపిక సిద్ధార్థకు దగ్గరైందని అంటుంటారు. పలు కార్యక్రమాల్లో ఇద్దరూ రాసుకుపూసుకు తిరగడం కూడా ఈ వాదనకు బలమరింత బలం చేకూరింది కూడా. అయితే గత కొన్ని రోజులుగా ఇద్దరు దూరం దూరంగా ఉంటున్నారు. దీనికి కారణం అనిల్ కపూర్ కూతురు సోనమ్ కపూర్ కారణమనే గాసిప్స్ వినిపిస్తున్నాయి బాలీవుడ్ వర్గాల్లో..
అయితే తనపై వస్తున్న పుకార్లను లైట్ తీసుకుంటోంది ఈ భామ. దీనిపై ట్విట్టర్లో స్పందిస్తూ...నేను ఎవరినీ విడగొట్టలేదు ఎవరితోనూ డేటింగ్ చేయడం లేదు, కెరీర్ పైనే పూర్తి కాన్సట్రేషన్ పెట్టాను, నా పని నేను చూసుకుంటున్నాను అంటూ వెల్లడించింది. ఇలాంటి గాసిప్స్ ఎవరు క్రియేట్ చేస్తారో అర్థం కావడం లేదు, ఇవన్నీ నేనేమీ సీరియస్‌గా తీసుకోను అని స్పష్టం చేస్తోంది.
సోనమ్ కపూర్ ఈ సంవత్సరం ఇప్పటి వరకు నాలుగు బాలీవుడ్ సినిమాల్లో అవకాశం దక్కించుకుంది. ఇప్పటికే ఆమె నటించిన ప్లేయర్స్ చిత్రం విడుదలైంది. భాగ్ మిల్కా భాగ్, రాజ్ కుమార్ సంతోషి రూపొందిస్తున్న చిత్రంలో, బాజీరావు మస్తానీ చిత్రంలో నటించబోతోంది.


Click it and Unblock the Notifications











