»   » ఐలవ్ 'సెక్స్'...కానీ సహ నటులతో మాత్రం కాదు... : హీరోయిన్ ఇలా బోల్డ్ గా చెప్పేసిందేంటి?

ఐలవ్ 'సెక్స్'...కానీ సహ నటులతో మాత్రం కాదు... : హీరోయిన్ ఇలా బోల్డ్ గా చెప్పేసిందేంటి?

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ సోనమ్ కపూర్ ...హానెస్ట్ అనగా నిజాయితికి బ్రాండ్ అంబాసిడర్ గా తిరుగుతూంటుంది . తిరగనివ్వండి..మాదేం పోయింది. ఆవిడ హానెస్టి ఆవిడ ఇస్టం అంటారా... ఓకే, అయితే ఆవిడ నిజాయితీ పేరుతో చేసే కామెంట్స్ తో బాలీవుడ్ జనం ఉక్కిరిబిక్కిరి అయ్యిపోతున్నారట.

తను ఏదీ మనస్సులో పెట్టుకోనని, ఉపేంద్ర సినిమాలో ఉపేంద్రలా ఏది మనస్సులో అనిపిస్తే అది పైకి అనేస్తాను అన్నట్లు బిహేవ్ చేస్తోంది సోనమ్. దాంతో లేనిపోని సమస్యలు వచ్చేస్తున్నాయి. కాకపోతే ఆల్రెడీ స్టార్ హీరోయిన్ కావటం, మాజీ స్టార్ హీరో అనీల్ కపూర్ కుమార్తె కావటంతో ఆమెను ఎవరూ ఏమీ అనే ధైర్యం చేయరు. మనస్సులోనే తిట్టిపోసుకుంటూంటారు.

ఇప్పుడీ రామాయణం అంతా ఏమిటి..విషయం చెప్పు అంటారా... సోనమ్ కపూర్ రీసెంట్ గా నేహాధూపియా రేడియో షో #NoFilterNeha లో పాల్గొంది. అక్కడ ఈ స్టైల్ ఐకాన్ బోల్డ్ గా బోల్డు కామెంట్స్ చేసేసింది. తన తమ్ముడు గురించి మాట్లాడటమే కాదు. తన తోటి హీరోయిన్స్ మీద నాలుగైదు వ్యంగ్య బాణాలు విసిరింది. ఫలానా అని పేరు పెట్టలేదు అనలేదు కానీ ఆ సెటైర్స్ తగలాల్సిన వాళ్లకే తగిలాయట.

కో ఆర్టిస్ట్ లతో సెక్స్ లో ...

కో ఆర్టిస్ట్ లతో సెక్స్ లో ...

ఇంతకీ సోనమ్ నోటి వెంట వచ్చిన ఆ అద్బుతమైన మాట ఏమిటీ అంటే... తాను ఏ కో స్టార్ తోనూ సెక్స్ లో పాల్గొనలేదు అని. కాబట్టే తాను వారితో మంచి కెమస్ట్రీని మెయింటైన్ చెయ్యగలిగాను అని చెప్పింది. దీని అర్దమేమి తిరుమలేస అని బాలీవుడ్ తలపట్టుకుని కూర్చుంది.

అబ్బబ్బే..నేను అలాంటివాటికి బహు దూరం

అబ్బబ్బే..నేను అలాంటివాటికి బహు దూరం

సరేలే మహాతల్లీ ..నువ్వు చాలా గొప్పదానివి, ఇంతకీ ఎవరితో అయినా ఫిల్మ్ ఇండస్ట్రీలో డేటింగ్ చేసావా అని మీరు పొరపాటున అడిగితే... అబ్బే..నేను సింగిల్, నేను నా కో స్టార్స్ ఎవరితోనూ ఇప్పటివరకూ డేటింగ్ చెయ్యలేదు అని తేల్చి చెప్పేసింది. అయితే మరి ఆమె గత ప్రేమ వ్యవహారాలు విషయం ఏమిటి అంటారా..అవన్నీ డేటింగ్ లెక్కలోకి రావేమో మరి.

చెప్పు..చెప్పు..వింటాం..

చెప్పు..చెప్పు..వింటాం..

అడిగిన ప్రశ్నకు అక్కడితో ఆపితే ఆమె సోనమ్ కపూర్ ఎందుకవుతుంది...ఆమె కంటిన్యూ చేస్తూ...నేను ఇండస్ట్రీలో చాలా మందితో పరిచయాలు ఉన్నాయి. ఇండస్ట్రీ వ్యక్తులతో నిత్యం ఇంటరాక్ట్ అవుతూంటారు. కాంటాక్ట్ లో ఉంటూంటాను. కాని నిజం చెప్తున్నా. నాకు అసలు అలాంటి డేటింగ్ గట్రా వ్యవహారాలు అంటే అసలు ఇంట్రస్ట్ ఉండదు అనేసింది.

నో సెక్స్, నో ఎట్రాక్షన్

నో సెక్స్, నో ఎట్రాక్షన్

అంతెందుకు నాతో నటించిన వాళ్లతో నేను ఇంతకాలం ఎట్రాక్ట్ కాలేదంటే నమ్ముతారా. వాళ్లు అద్బుతమైన వాళ్లే. కానీ నాకు వాళ్లని చూస్తే అలాంటి ఆలోచనే కలగదు అదేంటో. వాళ్లతో నేను ఎప్పుడూ శృంగారంలో పాల్గొనలేదు అంటూ బాంబు పేల్చింది. అంటే మిగతా హీరోయిన్స్ అంతా అదే పనిలో ఉన్నట్లు ఆమె మాట్లాడింది.

సెక్స్, డబ్బు, ఫేమ్ ఏది కావాలంటే

సెక్స్, డబ్బు, ఫేమ్ ఏది కావాలంటే

అప్పుడు సోనమ్ ని ఇంటర్వూ చేస్తున్న నేహా...ఓ గొప్ప ప్రశ్న అడిగింది. , " ఓ ప్లేన్ లో నువ్వు ఉండి..అది కూలిపోతూంటే భగవంతుడు కొన్ని ఆప్షన్ లు (సెక్స్, మనీ, మూవీస్ ఫేమ్ )ఇచ్చాడు. ఏది ఎంచుకుంటావు.. దానికి ఏం సమధానం చెప్పి ఉంటుందంటారు సోనమ్.

ఏం జవాబు చెప్పిందో తెలుసా

ఏం జవాబు చెప్పిందో తెలుసా

అంత గొప్ప ప్రశ్న అని ఫీలై నేహా అడిగితే దానికి వెంటనే సోనమ్ తడుముకోకండా సమాధానమిచ్చింది. ఆమె చెప్పింది ఏమిటో తెలుసా..ఫేమ్ అంటే గుర్తింపు. అవును నాకు ఫేమ్ అంటే ప్రేమ, నేను నేనుగా గుర్తింపు తెచ్చుకోవాలని , గౌరవింపబడాలని అనుకుంటాను అని చెప్పింది.

అంతకు మించి...

అంతకు మించి...

సోనమ్ సమాదానం భలే చెప్పిందే అనుకుంటున్నారా..కానీ దానికి కంటిన్యూషన్ వింటే మీరు ఆమె తెలివితేటలకు ఆశ్చర్యపోతారు. ఆమె ఏం అంటుందంటే..కానీ..నేను శృంగారాన్ని ప్రేమిస్తాను, నేను సినిమాలను ప్రేమిస్తాను, వాటిలో భాగంగా ఉండటానికి ఇష్టపడతాను అంది. అంటే దేనిగొడవ దానిదే అని చెప్పింది. వెరీ గుడ్డమ్మా.

ఇదంతా చదివితే ఈడౌట్

ఇదంతా చదివితే ఈడౌట్

సోనమ్ కపూర్ మాటలు విన్న మీకు ఏం డౌట్ వచ్చిందో తెలియదు కానీ బాలీవుడ్ లో మాత్రం ..ఆమె మాటలను బట్టి ఓ అండర్ స్టాండింగ్ కు వచ్చేసారు. ఏ నటి అయితే సహ నటులతో డేటింగ్ లేదా అచ్చ తెలుగులో చెప్పాలంటే శృంగారంలో పాల్గొనదో వాళ్ల మధ్య సరైన కెమెస్ట్రీ పండదు అని సోనమ్ కపూర్ భావన.

వాళ్లు ఈ పాటికి రగిలిపోతూంటారు

వాళ్లు ఈ పాటికి రగిలిపోతూంటారు

సోనమ్ కపూర్ మాటలు విన్న బాలీవుడ్ హీరోయిన్స్ ఓ రేంజిలో మండిపడుతున్నారట. అంటే తాము తెరపై హీరోతో సరైన కెమిస్ట్రీ పండిస్తే ...తెర వెనక ఆ హీరోతో ఏదో జరిగిందని అర్దం అనేగా ఆమె ఉద్దేశ్యం. అంత మాటంటుందా ..అసలు ఏమనుకుంటోంది తన గురించి అంటూ కారాలు, మిరయాలు నూరుతున్నారట.

ఏ హీరోయిన్ ని టార్గెట్ చేసిందో

ఏ హీరోయిన్ ని టార్గెట్ చేసిందో

ఇక ఇంతమాటలు సోనమ్ కపూర్ అన్నాక బాలీవుడ్ మీడియా ఊరుకుంటుందా..వెంటనే ఈమె ఏ హీరోయిన్ ని ఉద్దేశించి అంది, ఆ హీరోయిన్ తో ఏమన్నా విభేధాలు సోనమ్ కు ఉండి, అవన్నీ మనస్సులో పెట్టుకునే ఇలా అందా అంటూ రకరకాల ఊహాగానాలు అల్లేస్తోంది బాలీవుడ్ మీడియా.

English summary
Sonam Kapoor thinks that actresses who don't date their co-stars have a better chemistry on-screen. Well, we are not convinced! What about you readers?
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu