పవిత్ర ప్రేమపై లెక్చరిస్తున్న టాప్ హీరో కూతురు
పవిత్రమైన ప్రేమికులు ఈ కాలంలో లేరని, ఇది చాలా బాధాకరమైన విషయమైని అనిల్‌కపూర్ గారాల తనయ. బాలీవుడ్ సుందరాంగి సోనమ్ కపూర్ అభిప్రాయ పడింది. సమాజంతో పాటు నేడు చూస్తున్న సినిమాల్లో కూడా పవిత్ర ప్రేమ ఎక్కడా కానరావడం లేదు. ప్రజలు చాలా యాంత్రికంగా మారిపోయారు అంటూ తెగ బాధ పడిపోతోంది.
ఇంతకీ ఈవిడకు ఉన్నట్టుండి 'ప్రేమ" మీద ఇంత ప్రేమ ఎందుకు పుట్టుకొచ్చిందంటే..ప్రస్తుతం సోనమ్ 'మౌసమ్" అనే బాలీవుడ్ సినిమాలో నటిస్తోంది. పంకజ్‌కపూర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ త్వరలో ప్రేక్షకుల ముందుకురానుంది. కాశ్మీరీ అమ్మాయికి, సిక్కు అబ్బాయికి మధ్య 1970 దశకంలో జరిగే హృద్యమైన ప్రేమకథగా 'మౌసమ్" చిత్రం తెరకెక్కింది.
ఈ నేపథ్యంలో సినిమాకు తనదైన రీతిలో ప్రచారం కల్పిస్తోంది సోనమ్. 'మౌసమ్" చిత్రం మనం మరిచిపోయిన గతకాలం నాటి పవిత్ర ప్రేమ పరిమళాల్ని మనకు పరిచయం చేస్తుందని, అందమైన ప్రేమలోకంలో విహరింపజేస్తుంది"అని అంటోంది. విలువలులేని రాజకీయం, తీవ్రవాదం, అవినీతిలతో నిండిన సమాజంలో మనశ్శాంతి కరువైన ప్రజలకు ప్రేమే ఓదార్పు నిస్తుంది. ప్రపంచాన్ని మార్చాలంటే ప్రేమ ద్వారానే సాధ్యం" అంటూ ప్రేమ తత్వాన్ని భోదిస్తుందీ భామ. అంతేకాదు సంక్షిప్త సందేశాల ద్వారా ప్రేమ సందేశాలు వదిలిపెట్టి ప్రేమికులందరూ ఉత్తరాల ద్వారా ప్రేమను వ్యక్తపరచుకోవాలని అంటోంది. ఈ సినిమాలో నటించడం తన వ్యక్తిత్వంలో చాలా మార్పుని తీసుకువచ్చిందంటోంది ఈ సుందరి.


Click it and Unblock the Notifications











