ఆమెకు కెరీర్లో తొలి ముద్దుసీన్, టెన్షన్ ఉంటుంది మరి!
ముంబై: ప్రస్తుతం బాలీవుడ్లో ముద్దు సీన్ల కాలం నడుస్తోంది. దాదాపు అన్నీ సినిమాల్లోనూ ముద్దు సీన్లు తప్పనిసరిగా ఉండేట్లు చూసుకుంటున్నారు. ఆయుష్మాన్ ఖురానా, సోనమ్ కపూర్ జంటగా త్వరలో రాబోతున్న 'బేవకూఫియాన్' చిత్రంలోనూ హీరో హీరోయిన్ల మధ్య ముద్దు సీన్ ఉంది. సోనమ్ కపూర్ కెరీర్లో అభిమానులు చూడబోతున్న తొలి లిప్ లాక్ సీన్ ఇది.
వాస్తవానికి గతంలో రెండు సినిమాల్లో సోనమ్ కపూర్ లిప్ లాక్ సీన్లు చేసింది. అయితే అనుకోని కారణాలతో ఆ సీన్లు సెన్సార్ కత్తెరకు గురయ్యాయి. తొలిసారి తాను నటించిన ముద్దు సీన్ ప్రేక్షకులు, అభిమానులు చూడబోతున్న నేపథ్యంలో ఎలాంటి ఫీడ్ బ్యాక్ వస్తుందో అని సోనమ్ కాస్త టెన్షన్ పడుతుందట.

ఈ చిత్రంలో సోనమ్ కపూర్ హాట్ అండ్ సెక్సీ బికినీ సీన్లలో కూడా అభిమానులను కనువిందు చేయబోతోంది. ఇందులో బికీనీ ధరించడానికి పర్ ఫెక్ట్ బాడీ షేప్ రావడానికి పెద్దగా ఏమీ కష్టపడలేదు. నేను రెగ్యులర్‌గా సినిమాల్లో నటిస్తూనే ఉన్నాను కాబట్టి.....శరీరాకృతి విషయంలో పెద్దగా కష్టపడాల్సిన అవసరం రాలేదు. బేవకూఫియాన్ చిత్రం అందరినీ నచ్చుతుందని సోనమ్ కపూర్ చెప్పుకొచ్చారు.
సోనమ్ కపూర్, ఆయేష్మాన్ ఖురానా జంటగా....రూపొందుతున్న చిత్రం 'బేవకూఫియాన్'. బాలీవుడ్ ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ యశ్ రాజ్ ఫిలింస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. నుపుర్ అస్తానా ఈచిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. రిషీ కపూర్ ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నారు. హబీబ్ పైజల్ ఈ చిత్రానికి కథ అందించారు. రఘు దీక్షిత్ సంగీతం అందిస్తున్నారు. మార్చి 14న ఈ సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











