హీరోయిన్ హౌస్ అరెస్టు

By Staff

Sonam Kapoor
తన కూతురు రాత్రంతా బయిట తిరిగి నాలుగు దాటిన తర్వాత రావటంతో అనీల్ కపూర్ మండిపడి హౌస్ అరెస్టు చేసారు. సోనం కపూర్ హౌస్ అరెస్టు అంటూ ఈ వార్త ముంబయి లోని అన్ని న్యూస్ పేపర్స్ లోనూ వచ్చింది. సావారియా చిత్రంతో పరిచయమైన ఈ ముధ్దుగుమ్మ అనంతరం డిల్లీ-6 సినిమాలో అందరినీ తన అందచందాలతో ఆకట్టుకుంది. దాంతో అనీల్ కపూర్ ఎప్పుడు ఆమె వెనక ఉండి రక్షణ కల్పించేలా ఇద్దరు సెక్యూరిటి గార్డ్ లను నియమించాడు. అయితే దీనికి చిరాకుపడ్డ ఆమె వారి నుంచి తప్పించుకుని తిరగటానికి రకరకాల ప్లాన్స్ గీసింది.

ఈ విషయం తెలుసుకున్న అనీల్ కొద్దిగా షరతులు సడలించి రాత్రి తొమ్మిది లోపలే ఎన్ని పనులున్నా పూర్తి చేసుకుని ఇంటికి చేరాలని, గంటకోసారన్నా ఇంటికి ఫోన్ చేసి మాట్లాడాలని అన్నారు. అదీ అతిక్రమించి,రాత్రి నాలుగు దాటాక రావటంతో ఈ హౌస్ అరెస్టు నిర్ణయం తీసుకున్నాడని సమాచారం. అయితే ఆ తర్వత మీడియాకు కనపడిన సోనమ్ వారితో నవ్వుతూ ఇటువంటి రూమర్స్ తనపై ఎలా పుడుతున్నాయో తెలియటం లేదంటూ..తన తండ్రి హౌస్ అరెస్టు చేసేంత కర్కోటకుడు కాదంటూ కొట్టిపడేసింది. అనిల్ కపూర్ మాత్రం ఈ చర్యని ఓ భాద్యత గా వర్ణిస్తున్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X