సానియా మీర్జా పెళ్ళి కథతో సినిమా

By Srikanya

టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా జీవితం ఆధారంగా బాలీవుడ్లో ధాంక్యూ టైటిల్ తో ఓ రొమాంటిక్ కామెడీ తెరకెక్కనుంది. ఆమె జీవితంలో జరిగిన సంఘటలను కధగా మలచి తెరకెక్కించనున్నారు. సానియా పాత్రను సోనమ్ కపూర్ పోషించనుందని సమాచారం. అలాగే అక్షయ్ కుమార్ ఈ చిత్రంలో ప్లేబోయ్ పాత్రను పోషిస్తున్నారు. బాబీ డయోల్ మరో కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ నెల(ఏప్రియల్)కి ఈ చిత్రం కెనడాలో ప్రారంభంకానుంది. ఇక ఈ చిత్రంలో సానియాలాగ సోనమ్ కపూర్ ఓ టెన్నీస్ తార. ఆమె ఓ కుర్రాడుతో ప్రేమలో పడుతుంది. అయితే అది రాంగ్ ఛాయెస్ అని తర్వాత తేలుతుంది. అయితే అఫ్పటికే జరగవలిసిన నష్టం జరగిపోతుంది. ఆ సిట్యువేషన్ నుండి ఆమె ఎలా బయిటకు వచ్చి తిరిగి తన కెరీర్ ని ఎలా పునర్ నిర్మించికుందనేది మిగతా కథ అంటున్నారు.

ఇక కథలోని ఈ సంఘటనను బాలీవుడ్ మీడియా సానియా...మొదటి ఎంగేజ్ మెంట్ కాన్సిల్ అవటంతో పోలుస్తున్నారు. ఇక ఈ విషయాన్ని దర్శకుడు అనీస్ బజ్మీ కన్ఫర్మ్ చేస్తూ...సోనమ్ మా చిత్రంలో టెన్నిస్ స్టార్ గా చేస్తోంది. అలాగే అక్షయ్ కుమార్...ఒకేసారి ముప్పై మంది అమ్మాయిలను డీల్ చేసే వాడుగా కనిపిస్తాడు. అయితే అతను ఆమెను మొదట వేరే విధంగా చూసినా తర్వాత సీరియస్ గా ప్రేమలో పడతాడు. అలాగే ఈ చిత్రం కోసం సోనమ్ ఓ టెన్నిస్ కోచ్ వద్ద ట్రైనింగ్ తీసుకుంటోంది. ఈ చిత్రంలో ఆమె కెనడాలో ఓ స్టేట్ లెవిల్ ఛాంపియన్ గా కనిపించనుంది. ఆమె ప్రొపిషనల్ గా మారకపోయినా అలా కనిపించాలనే ఈ తాపత్రయం అన్నాడు. ఇక సానియా మీర్జా జీవితం ఆధారంగా చేస్తున్నారా అంటే...ఎవరైనా టెన్నిస్ స్టార్ పాత్ర అనగానే సానియా గుర్తుకు రావటం అతి సహజం అన్నారు. ఇక సోనమ్ కపూర్ గెటప్ ని పూర్తిగా సానియా లాగా తీర్చిదిద్దేందుకు ఆయన సిద్దమవుతున్నారని సమాచారం. క్రేజ్ రావాలంటే ఇలాంటి పాట్లు తప్పవు మరి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X