తమ్ముడూ అదిరిపోయావంటూ ఫస్ట్‌లుక్ రిలీజ్ చేసిన సోనమ్ (ఫోటో)
హైదరాబాద్: బాలీవుడ్లో మరో వారసుడు హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ప్రముఖ బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్ వారసత్వంతో ఇప్పటికే ఆయన కూతురు సోనమ్ కపూర్ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. స్టార్ హీరోయిన్ రేంజికి ఎదగక పోయినా సోనమ్ కపూర్ ఇపుడు వరుస అవకాశాలతో దూసుకెలుతోంది.

తాజాగా అనిల్ కపూర్ కుమారుడు హర్షవర్దన్ కపూర్ కూడా సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. సోనమ్ తమ్ముడైన హర్షవర్దన్ వయసు 25. 'మీర్జ్యా' అనే సినిమా ద్వారా హీరోగా తెరంగ్రేటం చేస్తున్నాడు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ ను సోనమ్ కపూర్ తన ట్విట్టర్ ద్వారా రిలీజ్ చేసింది.
రంగ్ దే బసంతి, ఢిల్లీ 6, భాగ్ మిల్ఖా భాగ్ లాంటి చిత్రాలక దర్శకత్వం వహించిన రాకేష్ ఓం ప్రకాష్ మెహ్రా ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో తెలుగులో రేర్ చిత్రంలో నటించిన సయామీ ఖేర్ హీరోయిన్ గా నటిస్తోంది. రొమాంటిక్ డ్రామాగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.
ఈ చిత్రంలో ఓంపురి, ఆర్ట్ మాలిక్, కెకె రైనా, అనుజ్ చౌదరి ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. భాగ్ మిల్ఖా భాగ్ చిత్రానికి సంగీతం అందించిన సంగీత త్రయం శంకర్, ఎస్సాన్, లాయ్ ఈ చిత్రానికి పని చేస్తున్నారు. ఈ సంవత్సరం అక్టోబర్ 7న సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. రాకేష్ ఓం ప్రకాస్ మెహ్రా సినిమాలు విభిన్నంగా ఉంటాయి. ఈ నేపథ్యంలో 'మీర్జ్యా' చిత్రంపై మంచి అంచనాలే ఉన్నాయి.


Click it and Unblock the Notifications











