»   » ట్రైలర్ చాలా రియలిస్టిక్ గా ఉంది (వీడియో)

ట్రైలర్ చాలా రియలిస్టిక్ గా ఉంది (వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై‌: బాలీవుడ్ లో బయోపిక్ ల హవా కొనసాగుతుంది. స్టార్ హీరోలు, స్టార్ హీరోయిన్లు కూడా నిజ జీవిత పాత్రల్లో నటించడానికి ఆసక్తి చూపిస్తున్నారు. సోనమ్ కపూర్ కూడా ఈ లిస్ట్ లో చేరిపోయింది. 1986లో హైజాక్ అయిన విమానంలో ప్రయాణికులను కాపాడుతూ ప్రాణాలు కోల్పోయిన ఫ్లైట్ అంటెండెంట్ నీరజా భనట్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న సినిమాలో సోనమ్ లీడ్ రోల్ లో నటిస్తోంది.

సోనమ్‌ కపూర్‌, షబానా అజ్మి ప్రధాన పాత్రల్లో నటించిన నీరజ చిత్రం ట్రైలర్‌ విడుదలైంది. గురువారం ముంబయిలో జరిగిన ఓ ప్రత్యేక కార్యక్రమంలో ఈ ట్రైలర్‌ను విడుదల చేశారు. మీరు ఇక్కడ ఆ ట్రైలర్ ని చూడవచ్చు.

1986 సెప్టెంబర్‌ 5న హైజాక్‌కి గురైన ఓ విమానంలోని 359 మంది ప్రయాణీకులను రక్షించే ప్రయత్నంలో తన ప్రాణాలు కోల్పోయిన నీరజ అనే ఎయిర్‌ హోస్టెస్‌ జీవితకథ ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. నీరజ పాత్రను సోనమ్‌ కపూర్‌ పోషించారు. ఈ చిత్రానికి రామ్‌ మాధవాని దర్శకత్వం వహించారు. ఫిబ్రవరి 19న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

కమర్షియల్ థ్రిల్లర్ ను తలపించే ఈ పాయింట్లు సినిమాగా తెరకెక్కించటానికిఉపయోగపడటంతో పాటు ఆడపిల్లలకు స్ఫూర్తిగా నిలుస్తాయంటుంది సోనమ్ కపూర్.

నీరజ, 1986లో ముంబై నుంచి న్యూయార్క్ వెళుతున్న విమానంలో సీనియర్ ఫ్లైట్ అటెండెంట్ గా వెళ్లింది. ఆ విమానం కరాచీ సమీపంలో హైజాక్ కు గురైనపుడు ప్రయాణికులను కాపాడే ప్రయత్నంలో ఎంతో సాహసోపేతంగా వ్యవహరించిన ఆమె, చివరకు ఉగ్రవాదుల కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయింది. అంతేకాదు నీరజ, అశోక చక్ర అవార్డుకు ఎంపికైన అతి పిన్న వయస్కురాలు.

English summary
This is the official trailer of Neerja, a biopic drama on the life Neerja Bhanot played by Sonam Kapoor, directed by Ram Madhvani, produced by Fox Star Studios and Bling Unplugged.
Please Wait while comments are loading...