twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మహేష్ బాబు సినిమాను తిరస్కరించిన సోనమ్

    By Bojja Kumar
    |

    హైదరాబాద్ : టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, హిట్ చిత్రాల దర్శకుడు శ్రీను వైట్ల కాంబినేషన్లో 'దూకుడు' తర్వాత 'ఆగడు' సినిమా ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో బాలీవుడ్ హీరోయిన్ సోనమ్ కపూర్‌ను హీరోయిన్ గా తీసుకునే యోచనలో ఉన్నట్లు ఫిల్మ్ నగర్ టాక్. ఈ విషయం ఆ నోట ఈనోట చేరి మీడియాలో సైతం ప్రచారం సాగడంతో సోనమ్ కపూర్ స్పందించింది. నేను మహేష్ బాబుతో చేస్తాననే విషయంలో నిజం లేదు అంటూ తన మైక్రో బ్లాగింగ్ ద్వారా తేల్చి చెప్పింది. సోనమ్ మహేష్ సినిమా ఆఫర్ ను తిరస్కరించిందనే విషయం ఫిల్మ్ నగర్లో హాట్ టాపిక్ అయింది.

    'ఆగడు' సినిమా వివరాల్లోకి వెళితే...దూకుడు చిత్రాన్ని నిర్మించిన అనిల్ సుంకర, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట ఈ చిత్రాన్ని 14 రీల్స్ ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై నిర్మించనున్నారు. ప్రస్తుతం శ్రీను వైట్ల జూ ఎన్టీఆర్ హీరోగా 'బాద్ షా' చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. మరో వైపు మహేష్ బాబు సుకుమార్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ఈ రెండు చిత్రాలు పూర్తయిన తర్వాత మహేష్ బాబు-శ్రీను వైట్ల తాజా చిత్రం సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది.

    దూకుడు తరహాలో 'ఆగడు' టైటిల్ క్యాచీగా ఉండటంతో దీన్నే దాదాపుగా ఫైనల్ చేసే అవకాశం ఉంది. 14 రీల్స్ ఎంటర్‌టైన్మెంట్స్ బేనర్లో 'దూకుడు' సినిమా చేసిన మహేష్ బాబు.....అదే బానర్లో సుకుమార్ దర్శకత్వంలో సినిమాకు కమిట్ అయ్యారు. ఆ సినిమా వెంటనే మళ్లీ ఇదే బేనర్లో శ్రీను వైట్లతో సినిమాకు అగ్రిమెంట్ కుదుర్చుకోవడం సర్వత్రా చర్చనీయాంశం అయింది. ఆ సంస్థ పని తీరు నచ్చడం వల్లనే మహేష్ బాబు వరుసగా ఆ సంస్థ కోసం డేట్స్ ఇస్తున్నారని, పైగా అనిల్ సుంకర, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంటలు మహేష్‌కు బాగా సన్నిహితులు అవ్వడం కూడా మరోకారణం అంటున్నారు.

    English summary
    
 It was reported that Sonam Kapoor will romance Mahesh Babu in his next film Aagadu, to be directed by Sreenu Vaitla. However, when asked the actress about this development, Sonam denied it saying 'it's untrue' on her micro blogging account.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X