స్వలింగ సంపర్కం ధోరణికాదు: పండిట్ రవిశంకర్ పై సోనమ్ కపూర్ ట్వీట్

హోమో సెక్సువాలిటీ ఓ ధోరణి కాదని, అది కొంత‌మందికి పుట్టుక‌తోనే వ‌చ్చే సాధార‌ణ విష‌య‌మ‌ని, ప్ర‌య‌త్నిస్తే మారిపోవ‌చ్చ‌ని స‌ల‌హా ఇవ్వ‌డం బాధ్య‌తా రాహిత్య‌మ‌ని ట్వీట్ చేసింది .

తాజాగా, విద్యార్థుల‌నుద్దేశించి ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్య‌వ‌స్థాప‌కుడు రవిశంకర్‌ చేసిన వ్యాఖ్య‌లు సోష‌ల్ మీడియాలో పెను దుమారాన్ని రేపుతున్నాయి. ఆ వ్యాఖ్య‌ల‌ను ఖండిస్తూ బాలీవుడ్ హీరోయిన్లు సోనమ్‌ కపూర్‌, అలియా భట్ లు ర‌వి శంక‌ర్ పై ఇన్ డైరెక్ట్ గా కామెంట్లు చేశారు. ప్ర‌స్తుతం ఆ ట్వీట్లు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయ్యాయి.

Recommended Video

నీకు బ్రా అవసరమా? సోనమ్‌కు నెటిజన్ల షాక్ !
స్వలింగ సంపర్క సమస్య

స్వలింగ సంపర్క సమస్య

ర‌విశంక‌ర్‌.....ఢిల్లీలోని జేఎన్‌యూలో సోమవారం ఓ కార్యక్రమానికి హాజరయ్యారు. తనకు స్వలింగ సంపర్క సమస్య ఉందని, దాని ద్వారా సంఘం, కుటుంబం నుంచి కొన్ని సమస్యలు ఎదుర్కుంటున్నాని ఓ విద్యార్థి తెలిపాడు. దీనికి వివరణ ఇచ్చే క్రమంలో రవిశంకర్ పెద్ద ఉపన్యాసమే దంచారు.

సోనమ్‌ కపూర్‌

సోనమ్‌ కపూర్‌

అది పుట్టుకతో వచ్చే ఓ ధోరణి మాత్రమేనని.. ప్రయత్నిస్తే ఖచ్ఛితంగా మార్పు వచ్చి తీరుతుందని ఆ విద్యార్థికి సలహా ఇచ్చారు. . ఈ నేప‌థ్యంలో రవిశంకర్‌ వ్యాఖ్యలపై పలువురు సోష‌ల్ మీడియాలో మండిపడుతున్నారు. బాలీవుడ్ హీరోయిన్‌ సోనమ్‌ కపూర్‌....ర‌వి శంక‌ర్ ను ఎద్దేవా చేస్తూ ఇన్ డైరెక్టుగా ట్వీట్లు చేసింది.

 పుట్టుక‌తోనే వ‌చ్చే సాధార‌ణ విష‌య‌ం

పుట్టుక‌తోనే వ‌చ్చే సాధార‌ణ విష‌య‌ం

హోమో సెక్సువాలిటీ ఓ ధోరణి కాదని, అది కొంత‌మందికి పుట్టుక‌తోనే వ‌చ్చే సాధార‌ణ విష‌య‌మ‌ని, ప్ర‌య‌త్నిస్తే మారిపోవ‌చ్చ‌ని స‌ల‌హా ఇవ్వ‌డం బాధ్య‌తా రాహిత్య‌మ‌ని ట్వీట్ చేసింది. పండిట్ రవిశంకర్ వ్యాఖ్యలపట్ల వ్యతిరేకత బలంగానే ఉన్నా సోనమ్ ట్వీట్ మాత్రం మరింత కలకలం రేపింది.

హిందోళ్‌సేన్‌గుప్తా

హిందోళ్‌సేన్‌గుప్తా

ఈ బాబాలు, స్వామీజీల స‌మ‌స్య ఏమిటో త‌న‌కు అర్థం కాద‌ని, ఒక‌వేళ హిందూయిజం, సాంప్రదాయల గురించి తెలుసుకోవాలంటే #హిందోళ్‌సేన్‌గుప్తా, #దైవదూత్‌మైత్ ల‌ను ఫాలో కావాలంటూ మ‌రో ట్వీట్‌ చేసింది. ఆ ట్వీట్‌ను మ‌రో నటి అలియా భట్‌ రీట్వీట్ చేసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X