ఫారిన్ లో దర్శక, నిర్మాతలకు నరకం చూపిన హీరోయిన్

By Srikanya

హీరోయిన్ తో ఫారిన్ ట్రిప్ అంటే దర్శక,నిర్మాతలు స్వర్గ లోక విహారం అని బయిట అనుకుంటూంటారు. అయితే తాజాగా బాలీవుడ్ హీరోయిన్ సోనమ్ కపూర్..కెనడాలో దర్శక,నిర్మాతలకు నరకమంటే ఏమిటో చూపించింది. సోనమ్ తండ్రి అనిల్ కపూర్ దగ్గరుండి ఆఫర్స్ ఇప్పిస్తూంటే ఆమె లెక్కా పత్రం లేకుండా టైముకి రాకపోవటం, షూటింగ్ లకు డుమ్మా కొట్టడం చేస్తూ దర్శక,నిర్మాతలను నానారకాలగా ఏడిపిస్తోంది. తాజాగా అనీస్ బజ్మీ దర్శకత్వంలో సోనమ్‌కపూర్ ప్రధాన పాత్రలో తెరకెక్కిస్తున్న ధాంక్యు చిత్రం షూటింగ్ కెనడాలో జరుగుతోంది. ఈ షూటింగ్‌లో సెట్స్‌కు సోనమ్ ప్రతిరోజూ ఆలస్యంగా రావడం, ఒక్కోరోజు ఎగ్గొట్టడం, షూటింగ్ పూర్తవకుండా వెళ్ళిపోవటం చేస్తోంది. రోజూ అదే తంతు కావటంతో చిర్రెత్తుకొచ్చిన దర్శకుడు ఏకంగా సోనమ్ తండ్రి అనిల్ కపూర్‌కు ఫిర్యాదు చేశాడట.వెంటనే అనిల్ రంగంలోకి దిగి సోనమ్‌ను మందలించడంతో సోనమ్ తన పద్ధతిని మార్చుకొని సమయానికి సెట్స్‌కు హాజరైందట.

దాంతో నిర్మాత ఆ సమయానికి అనీల్ కపూర్..కెనడాలోనే ఉన్నాడు కాబట్టి సరిపోయింది కానీ లేకపోతే మా పరిస్ధితి ఏమిటని అనుకున్నారు. అనీల్ కపూర్..సెట్స్‌కు వచ్చి సోనమ్‌ను మందలించడంతో షూటింగ్ సజావుగానే జరిగినా ఆమె ప్రవర్తన వల్ల సీనియర్ నటులైన ఇర్ఫాన్‌ఖాన్, సునీల్‌శెట్టి తదితరులు చాలా ఇబ్బంది పడ్డారని చిత్రవర్గాలు తెలిపాయి.ఇక ఈ విషయాన్ని అలా ఉంచితే...సోనమ్‌తో పంకజ్ కపూర్..మౌసమ్ పేరుతో తెరకెక్కించిన చిత్రం షూటింగ్‌లో కూడా సోనమ్ చుక్కలు చూపించిందట. అలా రెండుసార్లు సోనమ్ కారణంగా షూటింగ్‌కు ప్యాకప్ చెప్పాల్సి వచ్చిందని పంకజ్ కూడా అనిల్‌తో చెప్పాడట. దీంతో అనిల్ సదరు దర్శకులకు సోనమ్‌తో సారీ చెప్పించాడని సమాచారం.తెలుగులోనూ కొందరు హీరోయిన్స్ ఇలా ఇబ్బంది పెడుతున్నా ఎవరూ నోరు విప్పటం లేదు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X