బికినీపై మోజు పడుతున్న హీరో కూతురు
బాలీవుడ్ స్టార్ అనిల్ కపూర్ కుమార్తెగా బాలీవుడ్ తెరంగ్రేటం చేసిన సోనం కపూర్ సినిమాల్లో చేయబట్టి ఐదేళ్లు పూర్తయినా ఇప్పటి వరకు సరైన హిట్టనేదే లేదు. స్టార్ హీరోలతో నటించినా..చిన్న హీరోలతో నటించినా సోనమ్ అదృష్టం మాత్రం మారడం లేదు. ఇటీవల షాహిద్ కపూర్ తో కలిసి సోనమ్ నటించిన 'మౌసం' సినిమా ఓ మోస్తరు విజయం అందుకుంది. వారం రోజుల క్రితం విడుదలైన ప్లేయర్స్ చిత్రం పెద్ద ప్లాపుగా నిలిచిందనే చెప్పొచ్చు.
ఈ నేపథ్యంలో సోనమ్ రూటు మార్చాలని నిర్ణయించుకుంది. తన స్టార్ డమ్ పెంచుకోవడమే లక్ష్యంగా ఇక హాట్ అండ్ స్పైసీగా బాలీవుడ్ తెరపై రెచ్చిపోవాలని చూస్తోంది. ఇప్పటి వరకు బాలీవుడ్ లో టాప్ రేంజ్ లో ఉన్న చాలా మంది హీరోయిన్లు పెర్ఫార్మెన్స్ తో పాటు బికినీలు వేసి పైకొచ్చిన వారే. తాజాగా సోనమ్ కపూర్ కూడా అదే బాటలో నడుస్తానని, 2పీస్ బికినీ వేస్తానని అంటోంది.
ఈ విషయమై ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సోమన్ మాట్లాడుతూ...బికినీ గురించి పెద్ద కహానీయే చెప్పకొచ్చింది. ఈ రోజుల్లో బికినీ వేయడం కామన్, ఇప్పడు బికినీ వేయడం ఫ్యాషన్, అభిమానులు కూడా స్టార్స్ ను బికినీలో చూడటానికి ఇష్ట పడుతున్నారు. సినిమాలు తీసేదే అభిమానులను తృప్తి పరచడానికి, నేను ఎప్పటికైనా బికినీ వేస్తానంటూ చెప్పకొచ్చింది.


Click it and Unblock the Notifications












