Don't Miss!
- Sports PBKS vs MI: నిప్పులు చెరిగిన బుమ్రా.. ఓడిపోయే మ్యాచ్‌లో గెలిచిన ముంబై ఇండియన్స్!
- News పొన్నూరు వైసీపీ అభ్యర్థి అంబటి మురళీపై చర్యలకు ఈసీ ఆదేశం
- Lifestyle గుడ్‌నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్‌బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
బికినీ వేసిందని ఫ్యాన్స్ తెగ తిడుతున్నారు, అందుకే పాపం
హైదరాబాద్ : మంచు విష్ణు సరసన ఈడో రకం, ఆడో రకం చిత్రంలో హీరోయిన్ గా చేసిన సోనారికా కు కోపంవచ్చింది. అయితే ఆ కోపంకు కారణం కొంచం గమ్మత్తుగానే ఉంది. ఆమె రీసెంట్ గా బికినీ వేసుకుని, బాగుందికదా అని ఓ ఫొటో దిగి తన ఫ్యాన్స్ చూసి ఆనందిస్తారని ట్విట్టర్ లో షేర్ చేసింది.
అయితే ఆ బికిని చూసిన అబిమానులు..నీకిదేం పోయేకాలం అన్నరీతిలో ఓ రేంజిలో ఆమెను తిట్టిపోసారు. అదంతా చూసిన సోనారిక కు కోపం వచ్చింది. ఆ పోస్ట్ ని డిలేట్ చేస్తూ మండిపడింది. అదేంటి హీరోయిన్స్ గ్లామర్ ప్రదర్శన తప్పు కాదు కదా..అంతలా తిట్టిపోయాల్సిన పనేం ఉంది అంటారా. అక్కడే ఉంది. చిన్న లాజిక్.
ఆమె ఇంతకు ముందు బాలీవుడ్ లో లో దేవన్ కే దేవ్ మహాదేవ్ అనే సీరియల్ చేసింది. అందులో ఆమె శివుడు బార్య పార్వతిదేవి గా లీడ్ పాత్రలో కనిపించింది. దాంతో వారందరూ ఆమెను పార్వతి దేవిగానే ఆరాధించారు. ఇప్పుడు హటాత్తుగా ఇలా బికిని కట్టి కనపడేసరికి తట్టుకోలేకపోయారు.
సోనారికా ఏమంటోందంటే... "నేను ఏ ప్రపంచంలో నివసిస్తున్నానో నాకు తెలియదు. జనం బికినీని వేసుకోవటం కూడా క్రైమ్ గా చెప్తున్నారు. బికినీలో ఉన్న నా ఫోటో ని పోస్ట్ చేసి డిలేట్ చేయాల్సిన పరిస్దితిలు వచ్చాయి. నేను వీరి శాపాలని,నెగిటివిటినీ తట్టుకోలేకపోతున్నా ." అనే అర్దం వచ్చేటట్లుగా బాధపడుతూ రాసుకొచ్చింది.
ఆ మధ్య కాలంలో నాగశౌర్య హీరోగా నటించిన జాదూగాడు' అనే సినిమాతో, టాలీవుడ్ కి పరిచయమైన హీరోయిన్ సోనారిక బదోరియా. ప్రస్తుతం ఈ బ్యూటీకి టాలీవుడ్ లో మంచి అవకాశాలే వస్తున్నాయి. గతంలో టీవీ సీరియల్స్ తో దేశవ్యాప్తంగా పాపులర్ అయిన సోనారిక, ఇప్పుడు టాలీవుడ్ ని టార్గెట్ చేసిందనే చెప్పాలి. ఇక తను నటించిన జాదుగాడు మూవీ ప్లాప్ టాక్ ని తెచ్చుకున్నప్పటికీ, మంచు విష్ణుతో చేసిన చిత్రం హిట్ అవటంతో సోనారిక బదోరియా కి మాత్రం వరుస ఆఫర్స్ వస్తున్నాయి.
ఇక ఎక్స్ పోజింగ్ పరంగానూ సోనారిక బదోరియా ఓ అడుగు ముందుకు వేస్తుంది. సీన్ డిమాండ్ మేరకు, గ్లామర్ పరంగానూ తను ఎక్స్ పోజింగ్ చేయటానకి సిద్ధం అని చెప్పటంతో, ప్రస్తుతం ఓ రేంజ్ బడ్జెట్ సినిమాలకి సోనారిక బదోరియా హీరోయిన్ గా సెట్ అవుతుందని అంటున్నారు.