twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బికినీ వేసిందని ఫ్యాన్స్ తెగ తిడుతున్నారు, అందుకే పాపం

    By Srikanya
    |

    హైదరాబాద్ : మంచు విష్ణు సరసన ఈడో రకం, ఆడో రకం చిత్రంలో హీరోయిన్ గా చేసిన సోనారికా కు కోపంవచ్చింది. అయితే ఆ కోపంకు కారణం కొంచం గమ్మత్తుగానే ఉంది. ఆమె రీసెంట్ గా బికినీ వేసుకుని, బాగుందికదా అని ఓ ఫొటో దిగి తన ఫ్యాన్స్ చూసి ఆనందిస్తారని ట్విట్టర్ లో షేర్ చేసింది.

    అయితే ఆ బికిని చూసిన అబిమానులు..నీకిదేం పోయేకాలం అన్నరీతిలో ఓ రేంజిలో ఆమెను తిట్టిపోసారు. అదంతా చూసిన సోనారిక కు కోపం వచ్చింది. ఆ పోస్ట్ ని డిలేట్ చేస్తూ మండిపడింది. అదేంటి హీరోయిన్స్ గ్లామర్ ప్రదర్శన తప్పు కాదు కదా..అంతలా తిట్టిపోయాల్సిన పనేం ఉంది అంటారా. అక్కడే ఉంది. చిన్న లాజిక్.

    Sonarika's bikini photographs irk fans

    ఆమె ఇంతకు ముందు బాలీవుడ్ లో లో దేవన్ కే దేవ్ మహాదేవ్ అనే సీరియల్ చేసింది. అందులో ఆమె శివుడు బార్య పార్వతిదేవి గా లీడ్ పాత్రలో కనిపించింది. దాంతో వారందరూ ఆమెను పార్వతి దేవిగానే ఆరాధించారు. ఇప్పుడు హటాత్తుగా ఇలా బికిని కట్టి కనపడేసరికి తట్టుకోలేకపోయారు.

    సోనారికా ఏమంటోందంటే... "నేను ఏ ప్రపంచంలో నివసిస్తున్నానో నాకు తెలియదు. జనం బికినీని వేసుకోవటం కూడా క్రైమ్ గా చెప్తున్నారు. బికినీలో ఉన్న నా ఫోటో ని పోస్ట్ చేసి డిలేట్ చేయాల్సిన పరిస్దితిలు వచ్చాయి. నేను వీరి శాపాలని,నెగిటివిటినీ తట్టుకోలేకపోతున్నా ." అనే అర్దం వచ్చేటట్లుగా బాధపడుతూ రాసుకొచ్చింది.

    ఆ మధ్య కాలంలో నాగశౌర్య హీరోగా నటించిన జాదూగాడు' అనే సినిమాతో, టాలీవుడ్ కి పరిచయమైన హీరోయిన్ సోనారిక బదోరియా. ప్రస్తుతం ఈ బ్యూటీకి టాలీవుడ్ లో మంచి అవకాశాలే వస్తున్నాయి. గతంలో టీవీ సీరియల్స్‌ తో దేశవ్యాప్తంగా పాపులర్ అయిన సోనారిక, ఇప్పుడు టాలీవుడ్ ని టార్గెట్ చేసిందనే చెప్పాలి. ఇక తను నటించిన జాదుగాడు మూవీ ప్లాప్ టాక్ ని తెచ్చుకున్నప్పటికీ, మంచు విష్ణుతో చేసిన చిత్రం హిట్ అవటంతో సోనారిక బదోరియా కి మాత్రం వరుస ఆఫర్స్ వస్తున్నాయి.

    ఇక ఎక్స్ పోజింగ్ పరంగానూ సోనారిక బదోరియా ఓ అడుగు ముందుకు వేస్తుంది. సీన్ డిమాండ్ మేరకు, గ్లామర్ పరంగానూ తను ఎక్స్ పోజింగ్ చేయటానకి సిద్ధం అని చెప్పటంతో, ప్రస్తుతం ఓ రేంజ్ బడ్జెట్ సినిమాలకి సోనారిక బదోరియా హీరోయిన్ గా సెట్ అవుతుందని అంటున్నారు.

    English summary
    Sonarika Bhadoria had posted a couple of hot pictures of hers in bikini. The netizens cried foul her for playing a pious character and posting such revealing pictures.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X