‘రంగస్థలం’ పాటలు నన్ను వెంటాడుతున్నాయి: మంచు మనోజ్

త్వరలో విడుదల కానున్న రంగస్థలం సినిమా పాటలను మంచు మనోజ్‌‌కు చరణ్ వినిపించారు. పాటలు విన్న తర్వాత అవి తనను వెంటాడుతున్నాయంటూ మనోజ్ ట్విట్టర్లో పేర్కొన్నారు.

By Bojja Kumar

రామ్ చరణ్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో 'రంగస్థలం 1985' సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. దేవిశ్రీ ప్రసాద్ ఈచిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా ఆడియో త్వరలో విడుదలకానుంది.

'రంగస్థలం 1985' సినిమా కోసం దేవిశ్రీ ప్రసాద్ కంపోజ్ చేస్తున్న పాటలను రామ్ చరణ్ తాజాగా మనోజ్‌కు వినిపించారు. ఆ పాటలు విన్న వెంటనే ట్విట్టర్లో స్పందించారు.

"నా బ్రదర్ రామ్ చరణ్ 'రంగస్థలం' పాటలు వినిపించినప్పటి నుంచి... అవి నన్ను వెంటాడుతున్నాయి. ఆడియో, సినిమా రిలీజ్ కోసం వెయిట్ చేయలేకపోతున్నా. వెంటనే విడుదల చేయండి", అంటూ ట్వీట్ చేశాడు.

1985నాటి గ్రామీణ వాతావరణం నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. చరణ్ సరసన సమంత నటిస్తోంది. వేసవి బరిలో రానున్న ఈ చిత్రం రిలీజ్‌కు ముందే ప్రీ రిలీజ్ బిజినెస్ విషయంలో సరికొత్త రికార్డులు నెలకొల్పుతోంది.

రంగస్థలం సినిమా బిజినెస్ గురించి ట్రేడ్ అనలిస్టులు వెల్లడిస్తున్న సమాచారం ఈ చిత్రం ఏకంగా రూ.18 కోట్లకు శాటిలైట్ రైట్స్‌ను ప్రముఖ టెలివిజన్ ఛానెల్ సొంతం చేసుకొన్నట్టు సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X