తెలుగులో సోనియా అగర్వాల్‌ ఐటం సాంగ్

By Srikanya

హైదరాబాద్ : 7/జి బృందావన కాలనీ చిత్రంతో తెలుగు ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న హీరోయిన్ సోనియా అగర్వాల్‌ గుర్తుండే ఉంటుంది. ఆ తరవాత ఆమె కెరీర్‌ సజావుగా సాగలేదు. ఇప్పుడు ప్రత్యేక గీతాలవైపు దృష్టి మళ్లించింది. అంజి శ్రీను దర్శకత్వం వహిస్తున్న చిత్రం 'అమ్మానాన్న వూరెళితే'. సిద్దార్థ్‌వర్మ, విజయ్‌, మధు ప్రధాన పాత్రలు పోషించారు. జక్కల నాగేశ్వరరావు నిర్మాత. ఈ చిత్రంలో సోనియా ఓ ప్రత్యేక గీతంలో నర్తించింది. ఈ పాటతో చిత్రీకరణ పూర్తయింది. వచ్చే నెలలో పాటల్ని విడుదల చేస్తారు.

దర్శకుడు మాట్లాడుతూ ''యువతరానికి నచ్చే కథాంశం ఇది. జీవితాన్ని ఆస్వాదించే ప్రయాణంలో యువత పెడదారి పడుతోంది. ఈ పరిస్థితుల్లో వారికి కనువిప్పు కలిగించే చిత్రం అవుతుంది''న్నారు. ప్రస్తుతం ఈ పాట చిత్రీకరణ హైదరాబాద్‌లో జరుగుతోంది.

నిర్మాత మాట్లాడుతూ -''నేడు యువత నాశనం అవ్వడానికి ఎన్నో కారణాలున్నాయి. అవన్నీ ఒకే సినిమాలో చూపించలేం. అందుకే యువత భవిష్యత్తును నాశనం చేస్తున్న ముఖ్యమైన అంశాల నేపథ్యంలో అంజి శ్రీను ఈ చిత్రం చేస్తున్నారు. సోనియా అగర్వాల్ చేసిన '7/జి బృందావన కాలనీ'ని చూసి ఆమె అభిమాని అయ్యాను. ఈ సినిమాలో సోనియా ప్రత్యేక గీతం చేయడానికి అంగీకరించినందుకు ఆనందంగా ఉంది'' అన్నారు.

ఈ పాట చిత్రీకరణతో సినిమా పూర్తవుతుందని, వచ్చే నెల పాటలను విడుదల చేయనున్నామని సహనిర్మాతల్లో ఒకరైన సలామ్ చెప్పారు. సిద్దార్ధ్‌వర్మ, విజయ్, మధు, తేజ, శిల్పాస్విత తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి మాటలు: కేవీ రాజు, కెమెరా: ఖాదర్, సహనిర్మాతలు: సలామ్, అశోక్. సంగీతం: మున్నాకాశీ.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X