స్టార్ కపుల్‌కి సోనియాగాంధీ ఇన్విటేషన్
బాలీవుడ్ న్యూ కపుల్ ఇషా డియోల్-భరత్ తక్తానీలకు ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ నుంచి ఇన్విటేషన్ అందింది. ఇటీవల పెళ్లి హాజరు కాలేక పోయిన సోనియా ఈ జంటను తన నివాసానికి విందుకు ఆహ్వానించారు. ఈ విందు కార్యక్రమంలో ప్రధాని మన్మోహన్ కూడా పాల్గొన బోతున్నట్లు తెలుస్తోంది.
నిన్నటి తరం బాలీవుడ్ స్టార్స్ హేమా మాలిని-ధర్మేంద్ర కుమార్తె అయిన ఇషా జూన్ 29న వ్యాపార వేత్త అయిన భరత్ తక్తానీని పెళ్లాడిన విషయం తెలిసిందే. ముంబైలోని ఓ హెటల్‌లో వీరి వివాహం గ్రాండ్‌గా జరిగింది. ఈ వేడుకకు బాలీవుడ్, రాజకీయ ప్రముఖులు హాజరై సందడి చేశారు.
సోనియా ఆహ్వానం మేరకు ఇషా-భరత్‌తో హేమా మాలిని-ధర్మేంద్ర కూడా ఢిల్లీ వెళ్లనున్నట్లు తెలుస్తోంది. అయితే ఇంకా తేదీ ఫిక్స్ కాలేదు. త్వరలోనే ఇందుకు సంబంధించిన వివరాలు తెలియనున్నాయి. సోనియా గాంధీ నుంచి పిలుపు అందడంతో హేమా మాలిని ఫ్యామిలీ చాలా హ్యాపీగా ఉన్నారు.
2002లో 'కోయి మేరా దిల్ సే పూచె' అనే చిత్రం ద్వారా బాలీవుడ్ టెరంగ్రేటం చేసిన ఇషా డియోల్ 'ధూమ్' లాంటి భారీ చిత్రాల్లో నటించినా...తల్లి మాదిరి స్టార్ హీరోయిన్ స్థాయిని అందుకోలేక పోయింది. తన కూతుర్ని హీరోయిన్ గా నిలబెట్టడం హేమమాలిని చాలా ట్రై చేసింది కానీ వర్కౌట్ కాలేదు.


Click it and Unblock the Notifications











