మహేష్ తాజా చిత్రం దూకుడులో సోనియా....
ఆంధ్రుల అందగాడు ప్రిన్స్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ఖలేజా తర్వాత మహేష్ నటిస్తున్న తాజా చిత్రం దూకుడు. ఈ సినిమాకి శ్రీను వైట్ల దర్శకత్వం వహించగా హీరోయిన్ గా సమంతా నటిస్తున్న విషయం అందరికి తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్ సమంతా ప్రక్కన హీరోయిన్ ప్రెండ్ గా నటించడానికి మంచి క్యారెక్టర్ ఉండడంతో ఆ క్యారెక్టర్ కి హ్యాపిడేస్, ఆవారా మరియు వినాయకుడు చిత్రాల్లో నటించిన సోనియా ని తీసుకోవడం జరిగిందంట. ఈ విషయం తెలిసిన సోనియా ఆనందానికి అవధులు లేవంట.
ఇప్పటివరకు కూడా తన కెరియర్ లో ఆశించినంత హిట్ సినిమాలు లేకపోవడంతో ఈ సినిమా ద్వారా అన్న మంచి బ్రేక్ రావాలని కోరుకుంటుందని సమాచారం. ఇక మహేష్ బాబు సినిమాలో నటించడం అంటే మామూలు విషయం కాదని ఈ అమ్మడు ఇప్పటినుండే పెద్ద హాడావుడి చేస్తుంది. ఇక ఈ సినిమా విషయానికి వస్తే శ్రీనువైట్ల మహేష్ బాబు కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమాపై అభిమానులు చాలా అంచనాలు పెట్టుకున్నారు. ఈ సినిమాలో మహేష్ బాబును మరోకోత్త కోణంలో చూపించడానికి సిధ్దంగా ఉన్నానని ఇదివరకే శ్రీనువైట్ల వివరించిన విషయం అందరికి తెలిసిందే. ఇంకోక విషయం ఏమిటంటే ఈ సినిమాలో మహేష్ ద్విపాత్రాభినయం చేయనున్నారని సమాచారం.


Click it and Unblock the Notifications











