మహేశ్ కొత్త సినిమా అతిథి
తమిళ చిత్రసీమలో ఇప్పుడు పెళ్లి సందడి నడుస్తోంది. టాప్ స్టార్స్ సూర్య, జ్యోతిక జోడీ సెప్టెంబర్ 11న పెళ్లితో ఒక్కటవుతుండగా, వెనుకే మేమూ ఉన్నాం అంటూ అందాల తార సోనియా అగర్వాల్, దర్శకుడు సెల్వరాఘవన్ పెళ్లికి రెడీ అయ్యారు. ఇటీవల సెల్వరాఘవన్ తండ్రి కస్తూరిరాజా ఒక ప్రకటన చేస్తూ సోనియా తమ ఇంటి కోడలని ప్రకటించారు. సోనియా తల్లిదండ్రులతో పెళ్లి మాటలు మాట్లాడటానికి ఆయన కుటుంబ సభ్యులతో కలిసి పంజాబ్ కూడా వెళ్లారట.
సూపర్ హిట్ చిత్రం 7 జి బృందావన్ కాలనీ దర్శకుడైన సెల్వరాఘవన్ ప్రస్తుతం వెంకటేష్‌తో ఆడవారి మాటలకు అర్థాలే వేరులే.. చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. తమిళంలో పాపులర్ హీరో, సూపర్‌స్టార్ రజనీకాంత్ అల్లుడైన ధనుష్‌కు సెల్వరాఘవన్ స్వయానా అన్నయ్య. సెల్వ, సోనియాల పెళ్లికి రజనీ ఆశీస్సులు కూడా లభించాయట.


Click it and Unblock the Notifications